కోవిడ్‌ కొత్త వ్యాక్సిన్‌ ఆ క్యాన్సర్‌ని రానివ్వదు! అధ్యయనంలో వెల్లడి

20 Nov, 2023 13:55 IST|Sakshi

కోవిడ్‌ మహమ్మారి ప్రజలను ఎంతలా వణికించిందో తెలిసిందే. దీన్ని నుంచి సురక్షితంగా బటపడేందుకు బయోఎన్‌టిక్‌ కొత్త ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ఇది ఆ క్యాన్సర్‌ మహమ్మారిని రాకుండా కూడా నియంత్రిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తమ అధ్యయనంలో కనుగొన్నారు. కరోనా కోసం వ్యాక్సిన్‌ వేసుకున్నట్లే క్యాన్సర్‌ వ్యాక్సిన్‌లు వేసుకొవచ్చేనే ఆలోచనకు పురిగొల్పింది. భవిష్యత్తులో క్యాన్సర్‌ రాకుండా లేదా క్యాన్సర్‌ అటాక్‌ అయ్యే దశలో ఉన్న వాళ్ల పాలిట ఈ వ్యాక్సిన్‌ వరం అవుతుందని చెబుతున్నారు వైద్యులు. ఇంతకీ ఇది ఏ రకమైన క్యాన్సర్‌ని రాకుండా కాపాడుతుంది? అధ్యయనంలో కనుగొన్న సరికొత్త విషయలేంటీ?..

కోవిడ్‌కి సంబంధించిన ఎంఆర్‌ఎన్‌ వ్యాక్సిన్‌లపై క్లినకల్‌ ట్రయల్స్‌ నిర్వహించగా ఈ సరికొత్త విషయం వెల్లడైంది. ఇది క్యాన్సర్‌కి వ్యతిరేకంగా పనిచేసేలా రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపిస్తున్నట్లు గుర్తించారు. ఈ మేరకు క్యాన్సర్‌ ఇమ్యునోథెరపీకి చెందిన డేవిడ్‌, రూబెన్‌స్టెయిన్‌ సెంటర్‌ ఫర్‌ ఫ్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌కు సంబంధించిన శాస్త్రవేత్త వినోద్‌ బాలచంద్రన్‌ల బృందం ఈ విషయాలను వెల్లడించింది. ఇంతకీ ప్యాక్రియాటిక్‌ క్ అంటే.. జీర్ణవ్యవస్థలో ఒక భాగం. ఇది పొత్తికడుపులో ఉండే శరీర అవయవం. ప్యాంక్రియాస్ నిర్వహించే ముఖ్యమైన విధులేంటంటే.. జీర్ణక్రియను సులభతరం చేసే ఎక్సోక్రైన్ ఫంక్షన్, రరక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించే ఎండోక్రైన్ పనితీరు.

అయితే ఈ అవయవం వెలుపల అసాధారణ కణుతులు వస్తే దాన్ని ప్యాక్రియాటిక​ క్యాన్సర్‌ అంటారు. దీని వల్ల ఆహారం అరగదు. నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీన్ని ప్రారంభంలోనే గుర్తించటం కష్టం. దీన​ఇన తొలి దశలో గుర్తిస్తేనే రోగికి చికిత్స అందించి ప్రాణాలను కాపడగలం. అలాంటి ప్రమాకరమైన ప్యాక్రియాటిక్‌ క్యాన్సర్‌ని ఈ వ్యాక్సిన్‌ రాకుండా ఆపగలదని చెబుదున్నారు వైద్యులు. ఇది రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించి క్యాన్సర్‌ కణాలను గుర్తించేలా హెచ్చారిస్తాయి.

తత్ఫలితంగా ప్యాంక్రియాటిక్‌​ కణితుల్లో కనిపించే నియాయాంటిజన్‌ ప్రోటీన్లు అలారం గంటలుగా పనిచేసేలా చేసి రోగనిరోధక వ్యవస్థను సమీకరిస్తుంది. ఈ వ్యాక్సిన్‌లో ఉండే టీ కణాలు నిర్దిష్ట రోగ నిరోదక కణాల ఉత్పత్తిని ప్రేరిపించే లక్ష్యంతో పనిచేస్తాయని అధ్యయనంలో తేలింది. దీంతో రోగుల్లో ఈ క్యాన్సర్‌ కణితిని సులభంగా గుర్తించి శస్త్ర చికిత్స ద్వారా తొలగించగలుగుతారు వైద్యులు. అంతేగాదు మళ్లీ ఈ క్యాన్సర్‌ పునరావృత్తం గాకుండా చేస్తుంది డాక్టర్‌ బాల చంద్రన్‌ అన్నారు. దాదాపు ఏడేళ్లుగా దీనిపై పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ రోగులలో ఎలా పనిచేస్తుందనే ఆలోచనను రేకెత్తించిందని ఆ దిశగా మరిన్ని ప్రయోగాలు చేయాల్సి ఉందని అన్నారు వైద్యులు.

ఈ టీకాలు సంప్రదాయ టీకాల వలె కాకుండా జన్యు సంకేత విభాగాన్ని ప్రేరేపించి నిర్దిష్ట ప్రోటీన్‌ ఉత్పతి చేసేలా నిర్దేశిస్తుంది. తద్వారా రోగనిరోధక ప్రతిస్పందనను ప్రేరేపిస్తుంది. అందువల్ల ఈ వ్యాక్సిన్‌ ప్యాక్రియాంటిక్‌ క్యాన్సర్‌ని రాకుండా నివారించడంలో సమర్థవంతంగా పనిచేస్తుంది. ఈ పరిశోధనలు ప్యాంక్రియాంటిక్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగులకు జీవితంపై సరికొత్త ఆశను అందిస్తాయని అన్నారు వైద్యులు. దాదాపు 20 మంది రోగులపై చేసిన క్లినికల్‌​ ప్రయోగాల్లో ఈ చక్కటి ఫలితాలు కనిపించాయన్నారు. ఒకరకంగా పరిశోధనలు వ్యాక్సిన్‌ల ఆవశక్యత తోపాటు ఇతర క్యాన్సర్‌లను నివారించేలా మరిన్ని వ్యాక్సిన్‌లు అభివృద్ధి చేసే ఆలోచనకు నాంది పలికిందన్నారు. ఈ ఎంఆర్‌ఎన్‌ఏ వ్యాక్సిన్‌ ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌ సవాలుకు చెక్‌పెట్టేలా చేసి రోగుల జీవితంలో కొత్త ఆశాజ్యోతిని వెలిగించిందన్నారు శాస్త్రవేత్తలు. 

(చదవండి: సెల్యులర్‌ రీప్రోగ్రామింగ్‌కి ఆ విటమిన్‌ కీలకం: పరిశోధనల్లో షాకింగ్‌ విషయాలు)


 

మరిన్ని వార్తలు