జైలుకు బర్త్డే కేక్ పంపించారు

30 Jul, 2015 13:51 IST|Sakshi
యాకూబ్ మెమన్ సోదరుడు సులేమన్

ముంబై: ముంబై పేలుళ్ల కేసులో దోషిగా ఉన్న యాకూబ్ మెమన్ పుట్టిన రోజు సందర్భంగా అతని కుటుంబసభ్యులు జైలు అధికారులకు బుధవారం రాత్రి బర్త్డే కేక్ పంపించారు. మెమన్ పుట్టినరోజు వేడుక జరపాలని పోలీసులను కోరినట్లు తెలుస్తోంది. క్షమాబిక్ష పిటిషన్పై వారు అప్పటివరకూ ఎన్నో అశలు పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే గతేడాది మెమన్ తొలి పిటిషన్ ను తిరస్కరణను గురైన విషయం తెలిసిందే. మరోవైపు తెల్లవారితే తన 54వ పుట్టిన రోజు.. తెల్లవారితే ఉరి.. ఇలాంటి పరిస్థితుల మధ్య యాకూబ్ మెమన్ ఉద్వేగానికి లోనయ్యాడు. బుధవారం నాడు జైలు అధికారులు పెట్టిన ఆహారాన్ని కూడా అతడు తీసుకోలేదు.


తెల్లవారుజామున 1.20 గంటలకే మెమన్‌ను నిద్రలేపిన అధికారులు, ఆ తర్వాత అతడిని స్నానం చేయమన్నారు. జైలు సూపరింటెండెంట్, జైలు వైద్యాధికారి, జ్యుడీషియల్ మేజిస్ట్రేట్, ఇద్దరు ప్రభుత్వ సాక్షుల సమక్షంలో.. జైలు దుస్తుల్లోనే ఉన్న మెమన్ ను ఉరికంబం వద్దకు తీసుకెళ్లి ఉరి తీశారు. దీంతో 1993 నాటి ముంబై వరుస పేలుళ్ల కేసుకు సంబంధించి మొట్టమొదటి ఉరి శిక్ష అమలైనట్లయింది.

మరిన్ని వార్తలు