ఆస్ట్రేలియాలో దొరకని భారతీయ విద్యార్థి ఆచూకీ

22 Jul, 2013 16:19 IST|Sakshi

ఆస్ట్రేలియాలోని ఓ నేషనల్ పార్క్‌లో రెండు నెలల క్రితం అదృశ్యమైన ఓ  25ఏళ్ల  భారత సంతతి విద్యార్థి ఆచూకీ ఇంకా దొరకలేదని ఆస్ట్రేలియాన్ మీడియా ఆదివారం నివేదించింది. ప్రబ్‌దీప్ శ్రాన్ అనే భారతీయ విద్యార్థి గత నెల మే 13న ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్ వెల్స్ వద్ద కాజీయోస్కో నేషనల్ పార్క్‌లో అదృశ్యమైన సంగతి తెలిసిందే. అతని ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఇంకా వెతుకుతూనే ఉన్నారు. కాగా, అతని ఆచూకీ తెలిపిన వారికి  జాడ తెలిపిన వారికి అతని కుటుంబం లక్ష డాలర్ల బహుమతిని ప్రకటించింది.

 

ప్రబ్‌దీప్ కుటుంబ సభ్యులు అస్ట్రేలియాన్ ఎబీసీ న్యూన్‌కు చెప్పిన వివరాల ప్రకారం..  ప్రబ్‌దీప్ శ్రాన్ కాజీయోస్కో నేషనల్ పార్క్‌లో ఉన్న ఓ పర్వతాన్ని ఎక్కేందుకు ప్రయత్నించాడు. పర్వతాన్ని ఎక్కేందుకు వెళ్లిన క్రమంలో అతడు కనిపించకుండా పోయాడు. అనంతరం ప్రబ్‌దీప్ జాడ తెలుసుకునేందుకు తాము ఎంతోగానూ ప్రయత్నించామన్నారు. ప్రబ్‌దీప్ కోసం ఎంత వెతికినా ప్రయోజనం కనిపించలేదు. అతని ఆచూకి ఇంతవరకూ లభించలేదు. ఆస్ట్రేలియాలో హీమపాత సీజన్ ప్రారంభం కావటంతో భారీగా మంచు కురుస్తోంది. దీంతో వారు వెతికే ప్రయత్నాలను విరమించారు. ప్రబ్‌దీప్ ఎక్కడ ఉన్నా ప్రాణాలతోనే ఉండి ఉంటాడని, త్వరలోనే తమ వద్దకు చేరకుంటాడ ని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా రంగంలోకి దిగిన సాయుధ దళాలు అతని ఆచూకీ కోసం ప్రయత్నాలు చేపట్టాయి.

మరిన్ని వార్తలు