హ్యూస్టన్‌లో భద్రాద్రి రాముడి కల్యాణం

2 Jul, 2018 05:55 IST|Sakshi
హ్యూస్టన్‌ వేదికగా భద్రాద్రి రాముడి కల్యాణం

హ్యూస్టన్‌ : అమెరికన్‌ తెలంగాణ అసోషియేషన్‌ (ఆటా) నిర్వహిస్తున్న ప్రపంచ తెలంగాణ ద్వితీయ మ‌హాస‌భ‌ల చివరి రోజు వేడుకల్లో భద్రాద్రి రాముడి కళ్యాణం కన్నుల పండువగా జరిగింది. హ్యూస్ట‌న్ లోని జార్జ్ బ్రౌన్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా జరిగిన సభలకు భద్రాచలం నుంచి ఉత్సవ మూర్తులను తీసుకొచ్చిన పూజారులు ప్రత్యేక పూజలు చేశారు. వేడుకలో భాగంగా నిర్వహించిన సాహిత్య, సంగీత కార్యక్రమాలు అలరించాయి.

ఈ కార్యక్రమంలో ఆటా అధ్యక్షులు స‌త్యనారాయ‌ణ కందిమ‌ళ్ల‌, నిర్వహాణ కార్యద‌ర్శి బంగారు రెడ్డి, ఛైర్మన్ క‌రుణాక‌ర్ మాధ‌వ‌రం, ప్రెసిడెంట్ ఎలెక్ట్ వినోద్ కుకునూర్‌, స‌హాయ స‌మ‌న్వయ క‌ర్త జ‌గ‌ప‌తి వీరేటి, వివిధ క‌మిటీల ప్రతినిధులు ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి ప్రత్యేక విశిష్ట అతిథులుగా ఎంపీ జితేంద‌ర్ రెడ్డి, సీతారాం నాయక్‌, బీజేపీ రాష్ట్ర నాయ‌కులు కృష్ణప్రసాద్‌ల‌తో పాటు ప‌లువురు ప్రముఖులు హాజ‌ర‌య్యారు. (చదవండి: హ్యూస్టన్‌లో ఘనంగా ఆటా మ‌హాస‌భ‌లు)

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా