మైట ఆధ్వర్యంలో రక్త దాన శిబిరం

22 Dec, 2018 21:03 IST|Sakshi

మలేషియా తెలంగాణ అసోసియేషన్(మైట) ఆధ్వర్యంలో నేషనల్ బ్లడ్ సెంటర్ ఆఫ్‌ మలేషియాలో రక్త దాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. మహత్మా గాంధీ 150వ జన్మదిన సంబరాలలో భాగంగా ఇండియన్ హైకమిషన్ అఫ్ మలేషియా సహకారంతో దాదాపు 50 మంది మైట సభ్యులతో విజయవంతంగా నిర్వహించామని మైట అధ్యక్షుడు సైదం తిరుపతి తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న దాతలందరికి వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రవి చంద్ర కృతజ్ఞతలు తెలియజేసారు. 

ఈ కార్యక్రమములో ప్రెసిడెంట్ సైదం తిరుపతి, వైస్ ప్రెసిడెంట్ బూరెడ్డి మోహన్ రెడ్డి, జనరల్ సెక్రటరీ రవి చంద్ర, ముఖ్య కార్యవర్గ సభ్యులు కార్తీక్, సందీప్, మారుతి, రవి వర్మ, చందు, వెంకటేశ్వర్లు, సత్య, నరేందర్, అశ్విత, చిట్టి బాబు, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా