ఫిలిప్పీన్‌ సదస్సుకు మాజీ దౌత్యవేత్త డా. వినోద్‌ కుమార్‌

10 Feb, 2018 19:32 IST|Sakshi
డా.బిఎం వినోద్ కుమార్ (ఫైల్‌)

మైగ్రంట్ ఫోరమ్ ఇన్ ఏసియా ఆధ్వర్యంలో ‘వలసలకు సమగ్ర విధాన ప్రక్రియ’ అనే అంశంపై నిర్వహించే సదస్సుకు తెలంగాణ ఇమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ తరపున మాజీ దౌత్యవేత్త డా. వినోద్‌ కుమార్‌ హాజరుకానున్నట్లు ఆ ఫోరమ్‌ ప్రధాన కార్యదర్శి బిఎల్‌ సురేంద్రనాథ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు ఫిలిప్పీన్‌ రాజధాని మనీలాలో ఈ నెల 11,12 (ఆది, సోమవారం)న జరగనుంది. అనుభవం కలిగిన వారు ఈ అంతర్జాతీయ సదస్సులో పాల్గొని తమ అభిప్రాయాలు తెలపనున్నారు. 

తెలంగాణ ఇమిగ్రంట్స్ వెల్ఫేర్ ఫోరమ్ తరపున పాల్గొనే డా.బిఎం వినోద్ కుమార్ నల్గొండ జిల్లాకు చెందినవారు. వృత్తిరీత్యా వైద్యులు (జనరల్ సర్జన్). ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్) లో 1986 లో చేరిన ఆయన భారత విదేశాంగ శాఖలో వివిధ హోదాలలో పనిచేసి 2015 లో రిటైర్ అయ్యారు. 1995-96 లో హైదరాబాద్ పాస్ పోర్ట్ అధికారిగా, 2010-12 లో విదేశాంగ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు. జర్మనీ, అల్జీరియా, మలేషియా, ఉజ్బేకిస్తాన్, అజర్ బైజాన్ దేశాలలోని భారత రాయబార కార్యాలయాల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ కమిటీ ప్రవాస భారతీయుల విభాగం అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.

మరిన్ని వార్తలు