దీక్షితులు మృతికి నాట్స్ సంతాపం

20 Feb, 2019 08:17 IST|Sakshi

డాలస్ : తెలుగు రంగస్థల, సినీ నటుడు, దర్శకుడు దీక్షితులు మరణంపై ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. సంస్కృత, తెలుగు భాషల్లో రంగస్థల కళల్లో ఎం.ఏ. డిగ్రీలు పొందిన దీక్షితులు.. రంగస్థలంతో పాటు సినిమాలలో కూడా తన సత్తా చాటారు. దీక్షితులు అకాలమరణంపై నాట్స్ దిగ్బ్రాంతి వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా, 2013 లో దీక్షితులు డాలస్లో జరిగిన  నాట్స్ అమెరికా తెలుగు సంబరాలలోనూ, 2011 న్యూ జెర్సీలో జరిగిన నాట్స్ అమెరికా తెలుగు సంబరాలలో పాల్గొన్న సందర్భాలను గుర్తుచేసుకొంది.  దీక్షితులు కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపింది.

మరిన్ని వార్తలు