5న సంబవాంగ్ పార్క్‌లో సింగపూర్ బతుకమ్మ వేడుకలు

30 Sep, 2019 14:33 IST|Sakshi

సంబవాంగ్ : తెలంగాణ కల్చరల్ సొసైటీ సింగపూర్ (టీసీఎస్‌ఎస్‌) ఆధ్వర్యంలో సంబవాంగ్ పార్క్‌లో అక్టోబర్ 5న జరగబోయే సింగపూర్ బతుకమ్మ పండుగ సంబరాలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి టీసీఎస్‌ఎస్‌ సభ్యులు కరపత్రాలను విడుదల చేశారు. ఈ బతుకమ్మ పండుగకు ప్రవేశం ఉచితమని, ఉత్తమ బతుకమ్మలకు ఆకర్షణీయమైన బహుమతులు అందజేయనున్నట్టు నిర్వాహకులు పేర్కొన్నారు.  ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి టీసీఎస్‌ఎస్‌ కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు.

సింగపూర్‌లో ఉన్న  తెలంగాణవాసులే కాకుండా తెలుగు వారందరితోపాటూ, మిగతా రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సంబరాల్లో పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని టీసీఎస్‌ఎస్‌ కోరింది. సంబరాలు విజయవంతంగా నిర్వహించడానికి సహయం అందిస్తున్న దాతలకు, ప్రతి ఒక్కరికి టీసీఎస్‌ఎస్‌ అధ్యక్షులు నీలం మహేందర్, ఉపాధ్యక్షులు గడప రమేష్ బాబు, గర్రేపల్లి శ్రీనివాస్, పెరుకు శివరాం ప్రసాద్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కోశాధికారి నల్ల భాస్కర్ గుప్త, సంస్థాగత కార్యదర్శి చేన్నోజ్వాల ప్రవీణ్,  ప్రాంతీయ కార్యదర్శులు మంగలి దుర్గా ప్రసాద్, గోనె నరేందర్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, గింజల సురేందర్ రెడ్డి, ఇతర సభ్యులు బొడ్ల రోజా రమణి, అనుపురం శ్రీనివాస్, నడికట్ల భాస్కర్, జూలూరి సంతోష్, రాము బొండుగుల, నంగునూరి వెంకట రమణ, శ్రీధర్ కొల్లూరి, కల్వ రాజు, దిలీప్, శివ ప్రసాద్ ఆవులలు కృతజ్ఞతలు తెలియజేశారు.

Read latest Nri News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా