డెన్మార్క్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

16 Oct, 2018 18:38 IST|Sakshi

కోపెన్‌హెగెన్‌: తెలంగాణా సంప్రదాయ పండుగ అయిన బతుకమ్మ సంబరాలను విదేశాల్లో వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణ సంస్కృతి ఉట్టి పడేలా డెన్మార్క్‌లో తెలంగాణ అసోషియేషన్‌ ఆఫ్‌ డెన్మార్క్‌(టాడ్‌) అధ్వర్యంలో యూరప్‌లోనే అతిపెద్ద బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారత రాయబారి అజిత్‌ గుప్త దంపతులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సంబరాలకు ఆడపడుచులు అధిక సంఖ్యలో బతుకమ్మలను తీసుకువచ్చి ఆట పాటలతో, కోలాటాల విన్యాసాలతో ఆనందంగా పాల్గొన్నారు. స్థానికంగా దొరికే వివిధ రకాల పుష్పాలతో బతుకమ్మలను అలంకరించి, సంప్రదాయ పరంగా బతుకమ్మల చుట్టూ ఆడపడుచులు తిరుగుతూ పాటలు పాడారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న టాడ్‌ అధ్యక్షుడు సామ సతీష్‌ రెడ్డి మాట్లాడుతూ.. ప్రకృతిని, పూలను, పూలలో దేవతలను పూజించే ఆడపడుచుల పండగ బతుకమ్మ అని, పాల్గొన్న ప్రతీ ఒక్కరికి బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు తెలిపారు. బ్రెగ్జిట్‌ తర్వాత యూరప్‌లో టాడ్‌ అతిపెద్ద అసోషియేషన్‌గా అవతరించి 4 వసంతాలు పూర్తి చేసుకొని, తెలంగాణ పండగలను పెద్ద ఎత్తున జరుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో టాడ్‌ బోర్డు సభ్యులు సంగమేష్వర్‌ రెడ్డి, రమేష్‌ పగిల్ల, జయచందర్‌ రెడ్డి కంది, వాసు నీల, దాము లట్టుపల్లి, వెంకటేష్‌, రాజారెడ్డి, రఘు కంకుంట్ల, రాజు ముచంతుల, కర్నాకర్‌, నర్మద దేరెడ్డి, ఉష, ప్రీమియం సభ్యులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు