సౌదీలో ఘనంగా వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు వేడుకలు

21 Dec, 2017 09:11 IST|Sakshi

సాక్షి, జెద్దా : ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సంక్షేమానికి పాటుపడుతున్న ప్రతిపక్షనేత, వైఎస్‌ఆర్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలను సౌదీ అరేబియాలో ప్రవాసాంధ్రులు ఘనంగా జరిపారు. ఈ సందర్భంగా వారు కేక్‌ కట్‌ చేసి జగన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వైఎస్‌ జగన్‌ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర సజావుగా సాగాలని మక్కా మసీదులో ప్రార్థనలు చేశారు. తమ అభిమాన నాయకుడి పుట్టిన రోజును ఉద్యోగం చేస్తున్న కంపెనీలో సహ ఉద్యోగులతో కలిసి జరుపుకున్నారు.

ఈ సందర్భంగా గుంటూరు జిల్లా వేమూరుకి చెందిన సలీం మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేస్తున్న వైఎస్‌ జగన్‌ పుట్టినరోజు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్రంలో జగనన్న పాలన రావాలని, వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజారిటితో వైఎస్‌ఆర్‌ సీపీనని గెలిపించుకోవాలని ఆయన కోరారు. మైనార్టీలకు వైఎస్సార్‌ 4% రిజర్వేషన్‌ కల్పించడం వల్ల తాము గల్ఫ్‌ దేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నామన్నారు.  వైఎస్‌ జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని తెలిపారు.

అంతేకాక మైనార్టీ సోదరులందరూ ఐక్యంగా జగనన్న వెంటే నడవాలని సలీం పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్‌ జగన్‌ సీఎం కావాలని మస్జిద్‌ ఏ మదీనా మున్వరాలో ప్రార్థనలు చేస్తామన్నారు. జగనన్నను కలిసి పవిత్రమైన జమ్‌ జమ్‌ నీటిని, ఖర్జుర పండును అందజేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో షేక్‌ సలీమ్‌, మహమ్మద్ సిరాజుద్దిన్‌‌, షేక్‌ ఫరిద్‌, మహమ్మద్‌ సిరాజ్‌, షేక్‌ ఇమ్రాన్‌, హమీద్‌, మున్వర్‌, ఆమేర్‌, గాలేబ్‌, షేక్‌ అప్సర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు