అమెరికాలో ఘనంగా వైఎస్ జగన్‌ జన్మదిన వేడుకలు

24 Dec, 2017 17:50 IST|Sakshi

ఆస్టిన్ (టెక్సాస్):  వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి జన్మదిన వేడుకలు అమెరికాలోని ఆస్టిన్‌లో ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్‌సీపీ ఎన్ఆర్ఐ శాఖ ఆధ్వర్యంలో ఆస్టిన్ లోని స్పైస్ రెస్టారెంట్ లో జరిగిన వేడుకలలో వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు, నాయకులు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేశారు.  

మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయ సాధనకై కృషి చేయాలని ప్రవాసాంధ్ర ప్రముఖులు పిలుపునిచ్చారు. మహానేత డాక్టర్‌ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కొనసాగాలంటే వైఎస్ జగన్‌ ముఖ్యమంత్రి కావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఈ సందర్భంగా పలువురు వక్తలు అన్నారు. జగన్‌ నాయకత్వం కోసం ఏపీ ప్రజలంతా ఎదురుచూస్తున్నారని తెలిపారు. 2014 ఎన్నికల్లో చెప్పిన ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేర్చలేదని మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మెజారిటీ సీట్లు కైవసం చేసుకుంటుందని, జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమంటూ ఆస్టిన్‌ లోని వైఎస్ఆర్ అభిమానులు విశ్వాసం వ్యక్తంచేశారు.

వైఎస్ జగన్‌ వ్యక్తి కాదని, ఓ శక్తి అని వంద మంది చంద్రబాబులు వచ్చినా ఆపే శక్తి వారికి లేదన్నారు. ఎస్సీలు, బీసీలు, మైనారిటీలు, ఓసీలు ఇలా అందరూ ఏకం కావాలని, చంద్రబాబు సైకిల్‌కు పంక్చర్‌ చేసి ఇంటికి పంపించాలని ముక్త ఖంఠంతో పిలుపునిచ్చారు. చంద్రబాబు పాలన అంతమైన అనంతరం జననేత జగన్ మోహన్ రెడ్డి ‘రాజన్న సువర్ణ యుగం’ పరిపాలనలో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉంటారని ధీమా వ్యక్తం చేసారు.  

ఆంధ్రప్రదేశ్ లో నేడు రైతులను మరిచి, అధికార గర్వంతో అభివృద్ధిని తుంగలో తొక్కి పూర్తిగా అవినీతిలో కూరుకుపోయి కొట్టుమిట్టాడుతున్న అధికార టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పి, ప్రజా సంక్షేమం మరచిన ఆ పార్టీని భూస్థాపితం చేయాలన్నారు. అందుకు వైఎస్ఆర్‌సీపీ అమెరికా విభాగం నడుం బిగించి తమ వంతు పాత్రను పోషించాలని పిలుపునిచ్చారు. తమ పూర్తి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తామని, దివంగత నేత వైఎస్ఆర్ బాటలో నడుస్తూ ప్రజాహితం కోసం సర్వదా పాటుపడతామని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో సుబ్బారెడ్డి చింతగుంట, రవి బల్లాడ, పుల్లారెడ్డి ఏడురు, మల్లికార్జున రెడ్డి ఆవుల, నారాయణ రెడ్డి గండ్ర, రామ్ గొంగినేని, శివ ఎర్రగుడి, ప్రవర్ధన్ చిమ్ముల, వెంకట్రామ్ రెడ్డి ఉమ్మ, బ్రహ్మేంద్ర లక్కు, రామ హనుమంత, మల్లి రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డిగారి, పరమేశ్వర రెడ్డి నంగి, చెంగల్ రెడ్డి ఎర్రదొడ్డి, కొండా రెడ్డి ద్వరసాల, ప్రదీప్ లక్కిరెడ్డి, అనంత్ బోయపల్లె, బద్రి ఎల్ఎం, తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

మరిన్ని వార్తలు