కువైట్‌లో ఘనంగా వైఎస్ఆర్‌సీపీ ఆవిర్భావ వేడుకలు

13 Mar, 2018 23:22 IST|Sakshi

మహనేత ఆశయం కోసమే వైఎస్‌ఆర్‌సీపీ పుట్టిందన్న నేతలు

కువైట్ : వైయస్ఆర్ కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలు కువైట్‌లో ఘనంగా జరిగాయి. ఏడు వసంతాలు పూర్తి చేసుకొని 8వ సంవత్సరంలో అడుగుపెడుతున్న సందర్భంగా మాలియా ప్రాంతము పవన్ రెస్టారెంట్‌లో వైఎస్‌ఆర్‌సీపీ కువైట్‌ యూత్ సభ్యులు అద్దాలూరి బాలకృష్ణా రెడ్డి గారి ఆధ్వర్యములో వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భముగా గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, కో కన్వీనర్లు గోవిందు నాగరాజు, యం నరసా రెడ్డిలు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి  వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం ఏర్పడిన పార్టీ వైయస్ఆర్‌సీపీ అని పేర్కొన్నారు.వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కుల, మత, పేద, ధనిక వర్గాలు అనే భేదం ప్రభుత్వ పథకాలను అమలు చేశారని, ప్రతి ఒక్కరు ఏదో ఒక రూపంలో లబ్ధిపొందిన వారేనని అన్నారు. తిరిగి రాజన్న రాజ్యం రావాలంటే రాజన్న బిడ్డ, జననేత వైయస్ జగన్‌మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. 

కార్యక్రమ నిర్వాహకులు బాలకృష్ణా రెడ్డి మాట్లాడుతూ నల్ల కాలువలో ప్రజలకు ఇచ్చిన మాట కోసం, వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి పదవిని తృణపాయంగా వదులుకున్న గొప్ప నేత అని, వైఎస్ఆర్‌సీపీలో సభ్యుడిగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు. గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు పి. రెహామన్ ఖాన్, ప్రధాన కోశాధికారి నాయని మహేష్ రెడ్డి మాట్లాడుతూ రెండు నాలుకల ధోరణితో పూటకో మాట మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రిని బుద్ధి చెప్పడానికి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సరైన నాయకుడని అన్నారు. ప్రవాసాంధ్రులు పార్టీ అభ్యున్నతికి తమవంతు సహాయసహాకారాలు అందించాలని కోరారు. 

ఈ కార్యక్రమములో ఇతర గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు తెట్టు రఫీ, రవీంద్ర నాయుడు, అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్ రెడ్డి, సలహా దారులు నాగిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, బీసీ ఇన్‌చార్జ్‌లు కె రమణ యాదవ్, సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌ గాలివీటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, యూత్ ఇన్‌చార్జ్‌ మర్రి కళ్యాణ్, యస్సీ, ఎస్టీ ఇన్‌చార్జ్‌ బిఎన్ సింహా, మైనారిటీ విభాగం ఇన్‌చార్జ్‌ షేక్ గఫార్, సాంస్కృతిక విభాగం ఇన్‌చార్జ్‌ కె వాసుదేవరెడ్డి, సలహాదారులు అన్నాజీ, ఆబూతురాబ్, సభ్యులు షా హుస్సేన్, పిడుగు సుబ్బారెడ్డి, రావూరి రమణ, కె సుబ్బారెడ్డి, యు వెంకట రమణ రెడ్డి, షేక్ సబ్దర్, కె హారినాధ్ చౌదరి, గౌస్ బాషా, మహాబూబ్ బాషా, రెడ్డి సంఘం గౌరవ అధ్యక్షులు మన్నూరు చంద్రశేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పి సురేష్ రెడ్డి, జగన్ హెల్పింగ్ హ్యాండ్స్ అధ్యక్షులు జబీవుల్లా, ఉపాధ్యక్షులు నాసర్, జగన్ సైన్యం అధ్యక్షులు  బాషా, అభిమానులు మల్లు శ్రీనివాసులు రెడ్డి, మన్నూరు సుబ్రహ్మణ్యం రెడ్డి, మల్లికార్జున రెడ్డి, సూరి రెడ్డి, రామారావులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు