స్వదేశం వస్తున్న వారికి ఉచిత టికెట్స్ ఇచ్చిన వైఎస్‌ఆర్‌సీపీ సభ్యులు            

18 Feb, 2018 15:44 IST|Sakshi

కువైట్ : వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ కువైట్ సభ్యులు అక్కడి ప్రభుత్వం ప్రకటించిన క్షమాబిక్ష  ద్వారా స్వదేశం  వెళుతున్న కోడూరు వాసులకు ఉచిత టికెట్స్ ఇప్పించారు. భారత రాయబార కార్యాలయం వద్ద కమిటీ సభ్యుల సహాకారంతో పోలి బుజ్జమ్మ (వెంకటరెడ్డి పల్లి, అరుంధతి వాడ), పెంచల సురేష్  (వెంకటరెడ్డి పల్లె, గిరిజన కాలనీ), గంపల నారాయణ (బైనపల్లి, ఎస్పీ కాలనీ) భారత  కార్యాలయ  అధికారి సెకండ్ సెక్రెటరీ  నారాయణ స్వామి వీరికి  టికెట్స్ ఇప్పించారు. ఈ విషయాన్ని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ   గల్ఫ్  , కువైట్  కన్వీనర్లు  ఇలియాస్, ముమ్మడి బాలిరెడ్డిలు ఓ ప్రకటనలో  తెలిపారు. 

ఈ  సందర్భంగా  బాలిరెడ్డి మాట్లాడుతూ  గత నెల 29 నుంచి అకామా ( రెసిడెన్సీ) లేని వారు  స్వస్ధలాలకు  వెళ్లిపోవచ్చని  కువైట్  ప్రభుత్వం ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతి  రోజు  భారత  కార్యాలయము  వద్దకు వచ్చే  తెలుగు  వారికి సహాకారం  అందిస్తున్నామన్నారు. అందులో భాగంగానే ఈ  ముగ్గురికి కూడా  అవుట్  పాస్‌లు ఇప్పించామని చెప్పారు.  కమిటీ  సభ్యులు, దాతల   సహాకారంతో  ఈ  ముగ్గురికి  ఉచిత  టికెట్స్ ఇప్పించిన  ప్రధాన  కోశాధికారి  నాయని  మహేశ్వర్  రెడ్డికి అభినందనలు  తెలిపారు.  

మహేశ్వర్  రెడ్డి  మాట్లాడుతూ..  ఇంతవరకు  రాష్ట్ర  ప్రభుత్వం  తరపు  నుంచి ఎటువంటి  సహాయం  అందక  పోవడం  సిగ్గు  చేటన్నారు.   తెలంగాణ  ప్రభుత్వం తరపున  అధికారులు  కువైట్  వచ్చి తెలంగాణ  వారికి  సహాకారం  అందించడం  అభినందనీయమని  తెలిపారు. ఈ  కార్యక్రమంలో  కో  కన్వీనర్లు  గోవిందు  నాగరాజు, ఎంవీ నరసా  రెడ్డి, గవర్ణింగ్ కౌన్సిల్  సభ్యుడు  పీ రెహమాన్  ఖాన్,  మీడియా ఇంచార్జ్‌  ఆకుల  ప్రభాకర్  రెడ్డి, బీసీ ఇంచార్జ్‌ రమణ  యాదవ్, లలితారాజ్, యూత్ ఇంచార్జ్‌  మర్రి  కళ్యాణ్, మైనారిటీ  సభ్యుడు  షేక్  రహామతుల్లా  తదితరులు  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు