కువైట్‌లో ఇఫ్తార్‌.. హాజరైన వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు

14 Jun, 2018 20:03 IST|Sakshi

కువైట్‌ : కువైట్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  కమిటీ ఆధ్వర్యంలో పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా ముస్లిం సోదరుల కోసం ఇఫ్తార్‌ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి కడప ఎమ్మెల్యే అంజాద్‌ బాషా, కమలాపురం ఎమ్మెల్యే పీ. రవింద్రనాథ్‌ రెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరైయ్యారు. కువైట్‌ భారత అంబాసిడర్‌ అయిన హెచ్‌.ఇ.కే. జీవసాగర్‌ను శాసనసభ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా వారు కువైట్‌లో తెలుగు వారి సమస్యలు గురించి మాట్లాడారు. ఈ విషయాలను అధికార ప్రతినిధి ఆకుల ప్రభాకర్‌ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా శాసనసభ సభ్యులు అంబాసిడర్‌తో మాట్లాడుతూ.. కువైట్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు చేసే సేవ కార్యక్రమాల ద్వారా తెలుగువారిని ఏ విధంగా ఆదకుంటుందో వివరంగా తెలిపారు. మన ఆంధ్ర వారు కువైట్‌లో దాదాపుగా 5 లక్షల మంది ఉన్నారు. ఒక కడప జిల్లా నుంచే సుమారు ఒక లక్ష యాభైవేల మంది ఉన్నారని తెలిపారు. అంతేకాక ఇక్కడ ఎవరైనా చనిపోతే వారి పార్ధివదేహాన్ని స్వస్థలం పంపించాలంటే రూ.లక్ష వరకూ ఖర్చు అవుతుందని చెప్పారు.

పేదవారు ఆ ఖర్చును భరించలేరు.. కాబట్టి ఆ ఖర్చును అంబాసి భరించేటట్లు చూడాలన్నారు. ఇక్కడ ఇంట్లో పని చేయడానికి వచ్చే వారికి కొందరు స్పాన్సర్‌ కష్టాలు పెడుతున్నారు. అలాంటి వారిని ఆదుకుని ఎటువంటి కేసులు లేకుండా ఇండియాకు పంపాలని కోరారు.  మహిళలు భారత్‌ నుంచి కువైట్‌కు రావాలంటే స్పాన్సర్‌ మన ప్రభుత్వానికి(అంబాసికి) దాదాపుగా రూ. 2 లక్షలు డిపాజిట్‌ కట్టాలని నిబంధన ఉంది. దాంతో స్పాన్సర్స్‌ ఇండియా మహిళను విజ ఇవ్వాలంటే ముందుకు రావడం లేదని ఎమ్మెల్యేలు తెలిపారు.

కాబట్టి రూ. 2 లక్షల డిపాజిట్‌ను తగ్గించాలని అన్నారు. ఇంట్లో ద్రవర్‌ గ హౌస్‌ మెయిడ్‌ అని పిలిచి ఆ పని ఇవ్వకుండా ఎడారిలో గొర్రెలు మేపడానికి నియమిస్తున్నారు. వారు ఎడారిలో పని చేయలేక ఆత్మహత్యలు చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. అలాంటి వారికి రక్షణ కల్పించి తిరిగి స్వస్థలం పంపే ఏర్పాట్లు చేయాలని గల్ఫ్‌ కన్వీనర్‌ ఇలియాస్‌ అంబాసిడర్‌ను ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్‌ రెడ్డి, అంజాద్‌ బాషాలు కోరారు. దీనిపై అంబాసిడర్‌ సానుకూలంగా స్పందించి తప్పకుండా అభ్యర్థనను పరిశీలిస్తామని తెలిపారు.
 

మరిన్ని వార్తలు