గ్రహం అనుగ్రహం (30-10-2016)

30 Oct, 2016 02:18 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (30-10-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం
దక్షిణాయనం, శరదృతువు,
ఆశ్వయుజ మాసం తిథి అమావాస్య రా.9.16 వరకు,
నక్షత్రం చిత్త ఉ.8.36 వరకు, తదుపరి స్వాతి,
వర్జ్యం ప.2.47 నుంచి 4.34 వరకు,
దుర్ముహూర్తం సా.3.55 నుంచి 4.44 వరకు,
అమృతఘడియలు రా.1.20 నుంచి 3.06 వరకు,
దీపావళి అమావాస్య

సూర్యోదయం    :    6.00
సూర్యాస్తమయం    :    5.33
రాహుకాలం : సా.4.30 నుంచి 6.00 వరకు
యమగండం : ప.12.00 నుంచి 1.30 వరకు

 

భవిష్యం


మేషం: పనులు సజావుగా పూర్తి కాగలవు. ఆకస్మిక ధనలబ్ధి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. విందు వినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.

 
వృషభం
: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. ధన, వస్తు లాభాలు. పాత మిత్రుల కలయిక. స్థిరాస్తి వృద్ధి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

 
మిథునం: మిత్రులతో మాట పట్టింపులు. వృథా ఖర్చులు. విచిత్ర సంఘటనలు. ఆకస్మిక ప్రయాణాలు. ఆలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు కొంత నిరాశ పరుస్తాయి.

 
కర్కాటకం: అనుకున్న కార్యక్రమాలలో జాప్యం. ప్రయాణాలు వాయిదా. ఆరోగ్యసమస్యలు. రాబడి కొంత మెరుగ్గా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒత్తిడులు.

 
సింహం: శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. నూతన ఉద్యోగప్రాప్తి. భూ లాభాలు. వ్యాపారాలు అభివృద్ధిపథంలో సాగుతాయి. ఉద్యోగులకు ఉత్సాహం.

 
కన్య: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటా బయటా ఒత్తిడులు. వ్యాపార, ఉద్యోగాలు నత్తనడకన సాగుతాయి.

 
తుల: ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగులకు అనుకోని హోదాలు.

 
వృశ్చికం: కుటుంబ సమస్యలు. రాబడికి మించి ఖర్చులు. ఆకస్మిక ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నిరాశ కలిగిస్తాయి. ఉద్యోగులకు పనిభారం.

 
ధనుస్సు: ఇంటర్వ్యూలు రాగలవు. పరిచయాలు పెరుగుతాయి. ఆహ్వానాలు అందుతాయి. భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలో అనుకూలం.

 
మకరం: నిరుద్యోగల కల ఫలిస్తుంది. కొన్ని వివాదాల పరిష్కారం. శుభ కార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు నూతనోత్సాహం.

 
కుంభం: వ్యయప్రయాసలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. పనులలో జాప్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి.

 
మీనం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. వృత్తి, వ్యాపారాలలో ఒడిదుడుకులు.


 - సింహంభట్ల సుబ్బారావు

>
మరిన్ని వార్తలు