గ్రహం అనుగ్రహం (31-12-2016)

31 Dec, 2016 00:28 IST|Sakshi
గ్రహం అనుగ్రహం (31-12-2016)

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం,
హేమంత ఋతువు పుష్య మాసం,
తిథి శు.విదియ ప.2.10 వరకు,
తదుపరి తదియ నక్షత్రం ఉత్తరాషాఢ ప.2.41 వరకు,
తదుపరి శ్రవణం, వర్జ్యం రా.6.37 నుంచి 8.26 వరకు,
దుర్ముహూర్తం ఉ.6.31 నుంచి 8.00 వరకు
అమృతఘడియలు ఉ.7.58 నుంచి 9.39 వరకు

సూర్యోదయం      :    6.32
సూర్యాస్తమయం  :    5.40
రాహుకాలం       :   ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం      :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం

మేషం: ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. విందువినోదాలు. కార్యజయం. ఆర్థిక ప్రగతి. దేవాలయ దర్శనాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

వృషభం: నిరుద్యోగులకు శ్రమాధిక్యం. పనుల్లో తొందరపాటు. ఆర్థిక ఇబ్బందులు. దూరప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.
మిథునం: ఆర్థిక వ్యవహారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. అనారోగ్యం. కుటుంబంలో ఒత్తిడులు. వృత్తి, వ్యాపారాలలో మార్పులు.

కర్కాటకం: కొత్త వ్యక్తుల పరిచయం. శుభవార్తలు. విందులువినోదాలు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశాజనకంగా ఉంటుంది.

సింహం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితుల నుంచి సాయం అందుతుంది. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.

కన్య: రుణాలు చేయాల్సివస్తుంది. ఆలోచనలు కలసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. కొన్ని పనులు వాయిదా పడతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.

తుల: రాబడి కంటే ఖర్చులు అధికం. పనుల్లో తొందరపాటు. ఆలయాల సందర్శనం. వ్యయప్రయాసలు. వ్యాపారాలు,ఉద్యోగాలలో చికాకులు.

వృశ్చికం: అనుకున్న రాబడి అందుతుంది. కార్యజయం. పలుకుబడి పెంచుకుంటారు. కొన్ని బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.

ధనుస్సు: ఆర్థిక ఇబ్బందులు. పనుల్లో అవాంతరాలు. ఆరోగ్యభంగం. దూర ప్రయాణాలు. సోదరులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.

మకరం: శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. కొత్త ఆశలు చిగురిస్తాయి. ఉద్యోగాన్వేషణ ఫలిస్తుంది. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.

కుంభం: అనుకున్న కార్యక్రమాలు ముందుకు సాగవు. దూరప్రయాణాలు. ఇంటాబయటా సమస్యలు. వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.

మీనం: వ్యవహారాలలో విజయం. ఆప్తుల నుంచి కీలక సమాచారం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు.

 సింహంభట్ల సుబ్బారావు

మరిన్ని వార్తలు