బాబు పాలనపై జనంలో అసంతృప్తి

7 Sep, 2016 00:56 IST|Sakshi
బాబు పాలనపై జనంలో అసంతృప్తి

కొమ్మినేని శ్రీనివాసరావుతో కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత పురందేశ్వరి
 
 
రాజధాని నిర్మాణానికి భూసేకరణ... పోలవరం ప్రాజెక్టు, పట్టిసీమ వంటి విషయాల్లో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించడం లేదని కేంద్ర మానవ వనరుల శాఖ మాజీ సహాయ మంత్రి, బీజేపీ నేత, ఎన్టీఆర్ కుమార్తె పురందేశ్వరి వ్యాఖ్యానించారు. పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన ఖర్చులను వివరంగా చూపకపోవ డం, రైతుల పునరావాసంపై స్పష్టత లేకపోవడం, ఏ విషయంలోనూ చర్చకు తావీయక పోవడం.. వంటి అన్ని అంశాలనూ బీజేపీ అగ్రనాయకత్వం దృష్టికి తీసుకెళుతున్నామని ఆమె అన్నారు.

రైతుల, డ్వాక్రా రుణమాఫీలకు సంబంధించి టీడీపీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ప్రబలంగా ఉందన్నారు. కేంద్రం సహకరించడం లేదనే వాదన అర్థరహి తమని, రాష్ట్రప్రభుత్వ వ్యవహారాల్లో అవినీతి తీవ్రంగానే ఉందని, భవిష్యత్తు పరిణామాలను బట్టే టీడీపీతో పొత్తుపై ఆలోచించుకుంటామని అన్నారు. హెదరాబాద్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ పునరావృతమౌతోందా అనే అనుమానం చాలామందిలో ఉందని చెబుతున్న పురందేశ్వరి ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే...


ఎన్టీఆర్ ఇంట్లో చాలా కఠినంగా ఉంటారని, అందుకే పిల్లలు ఆయనకు లాగా రాణించలేకపోయారని అంటుంటారు. నిజమేనా?

మన సంస్కృతి, పద్ధతులను తప్పకుండా పాటించాలని చెప్పేవారు. కఠినంగా కాదు కానీ కచ్చితంగా ఉండేవారు. అలాగే ఇంట్లో తనకు నచ్చని పనులు మేం చేసినట్లరుుతే ఎంతో విలక్షణంగా మాపై కోప్పడేవారు.

ఎప్పుడూ మాపై చెయ్యి చేసుకునేవారు కాదు. కాకపోతే ‘ఏం, మనకు మతులు పోతున్నాయి’’ అనే డైలాగ్ వదిలేవారు. మమ్మల్నే కాదు, ఆయన్ను కూడా కలుపుకుని ఆ మాట అనేవారు. చాలా తప్పు చేసి ఉంటేనే ఆ మాట అనేవారని మాకు తెలిసిపోయేది. మమ్మల్ని తిట్టి, చెయ్యి చేసుకుని ఉంటే, ఆ మాట ప్రభావం మామీద ఉండేది కాదు.


మీ రాజకీయ ప్రవేశం ఎలా జరిగింది?
మొదట కాంగ్రెస్ పార్టీలోకి నా భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వచ్చారు. అప్పట్లో బాపట్ల ఎంపీ స్థానంలో ఉన్న రామానాయుడికి దగ్గుపాటి గట్టిపోటీ ఇవ్వగలరనే ఉద్దేశంతో బాపట్ల ఎంపీ అభ్యర్థిగా రమ్మని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆహ్వానించారు. అయితే రాష్ట్ర రాజకీయాల్లో ఉండటమే తనకిష్టమని, మంచి అభ్యర్థి ఎవరూ కాంగ్రెస్‌కు దొరకరని భావిస్తే అప్పుడు పురందేశ్వరి పేరు పరిశీలించాల్సిందిగా దగ్గుబాటి సూచించారు.

ఇవేవీ నాకు తెలియవు. అభ్యర్థిగా పురందేశ్వరి ఉంటారని మరుసటి రోజు పేపర్లో ఒక లీక్ ఇచ్చారు. తర్వాత పిల్లలతో చర్చించి, బాధ్యతగా ఉంటామని వారు హామీ ఇచ్చిన తర్వాతే నేను పోటీ చేశాను. అనుకోకుండా, అనుద్దేశంగా, అనూహ్య మైన పరిస్థితుల్లోనే నా రాజకీయరంగ ప్రవేశం జరిగిపోయింది.


తెలుగుదేశం వేరే వాళ్ల చేతిలోకి వెళ్లిపోయింది కదా అని మీరు బాధపడ్డారా?
నాన్న జీవించి ఉన్నప్పుడు కోరుకుని మరీ సింహం గుర్తు తెచ్చు కున్నారు. నా మనస్సులో అదే మిగిలిపోరుుంది. మరోవైపున నాన్నను అవమానించి పార్టీ నుంచి బహిష్కరించడం, చివరకు అసెంబ్లీలో ఒక్కసారైనా మాట్లాడటానికి అవకాశం ఇవ్వండి అని అడిగినప్పుడు ఇవ్వకపోవడం జరిగింది. 

రోశయ్యగారు కూడా పలు సందర్భాల్లో నాతో చెప్పారు. ‘నాన్న కన్నీళ్లతో తలదించుకుని అసెంబ్లీ నుంచి బయ టకు వెళుతుంటే ఆనాడు ఎంత ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ మాకు కూడా కడుపు తరుక్కు పోయిందమ్మా’ అని అన్నా రాయన. నాన్నకు అలాంటి పరిస్థితి వస్తుందని మేమెన్నడూ ఊహించలేదు.


మన్మోహన్ సింగ్ ఎంతో ప్రాధాన్యం ఇచ్చినప్పటికీ  మీరు బీజేపీలోకి వచ్చేశారు కదా?
ఆయనకు వ్యతిరేకంగా కాదు.. జరిగిన పరిణామాల నేపథ్యంలో అలా జరిగింది. విభజన బిల్లు లోక్‌సభకు రానున్న ముందురోజు జరిగిన సమావేశంలో ప్రత్యేక హోదా ప్రస్తావనను నేనే లేవనెత్తాను. ప్రధానంగా వ్యవసాయ రాష్ట్రంగా మిగిలిపోతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వకపోతే కష్టం అని వాదించాను.

ఏపీకి ప్రత్యేక హోదా అనే అంశాన్ని ఆ బిల్లులో పెట్టకపోతే, ఎవ్వరూ మిమ్మల్ని గౌరవించరు అని నొక్కి చెప్పాను. వారు సరేనన్నారు. కానీ మరుసటి రోజు లోక్‌సభకు వచ్చినప్పుడు హోదా ప్రస్తావనే లేదు. దాని మీద చర్చే లేదు. ఊరికే వాయిస్ ఓటుతోటే ఆమోదించేశారు.


నేటికీ ప్రత్యేక హోదా రాలేదు కదా? ప్రత్యేక హోదాపై చంద్రబాబు రక్తం మరిగిపోయేలా బీజేపీ ఎలా చేస్తుంది?
ప్రత్యేక హోదాకు సంబంధించి 14వ ఆర్థిక సంఘం రూపంలో ఒక సాంకేతిక సమస్య ఉంది.  ఇంతవరకు ప్రత్యేక హోదా ఉన్న రాష్ట్రాలకు కూడా 2017 మార్చి తర్వాత అది ఉండదని ఏపీ సీఎం స్వయంగా చెప్పారు. ప్రత్యేక హోదా సంజీవని కాదని చెప్పింది కూడా ఆయనే కదా. అప్పుడు రక్తం మరగ లేదా? ఇంకోసారేమో అది జీవన్మరణ సమస్య అన్నారు. ఇదంతా వారికి తెలియని విషయమా?


 పోలవరంపై కేంద్రం సహకరించటం లేదని చంద్రబాబు అంటున్నారు?
పోలవరం విషయంలో ఒక వివరణ ఇవ్వాలి. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించి, బిల్లులో పెట్టిన తర్వాత దాని నిర్మాణ బాధ్యత సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వానిదే. ఇవ్వాళ కేంద్రప్రభుత్వం ఎక్కడా వెనుకాడలేదు. రూ. 2,334 కోట్లకు సంబంధించిన బిల్లును రాష్ట్ర ప్రభుత్వం గుత్తంగా జలవనరుల శాఖకు పంపించింది.

కానీ పంపించిన బిల్లులో అనుమానాలు ఉన్నాయి.  పట్టిసీమ దాంట్లో అంతర్భాగమని చెప్పి బిల్లులో పెట్టారు. కానీ పోలవరం డిజైన్ ను ప్రభుత్వం ఆమోదించుకున్నప్పుడు పట్టిసీమ దాంట్లో అంతర్భాగం కాదు. అలాగే పునరావాసం, భూసేకరణ వంటివాటిపై కేంద్రం వివరణ అడిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని సమర్పిస్తే స్పందించాల్సిన బాధ్యత కేంద్రం మీద కూడా ఉంది. పోలవరం ప్రాజెక్టు అథారిటీని విశ్వా సంలోకి తీసుకోవాలి అని బిల్లులో ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం దాన్ని కాన్ఫి డెన్‌‌సలోకి తీసుకోకుండా ఎలా చేశారు? ఇలా చాలా అనుమానాలు ఉన్నాయి.

దాన్నే కేంద్ర ప్రభుత్వం అడుగుతోంది. ఏదో గుత్తంగా రూ. 955 కోట్లు పట్టి సీమకు పెట్టాము. రూ. 184 కోట్లు పునరావాసం కోసం పెట్టామన్నట్లుగా కాదు. ఉన్న అనుమానాలను నివృత్తి చేయవలసిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. పోలవరం ప్రాజెక్టును చేయాలన్న పట్టుదల కేంద్రానికి ఉంది. ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వం సహకరించటం లేదంటూ అసత్యం మాట్లాడకూడ దని నా అభిప్రాయం. మీరు ఏం అడిగారు, ఎక్కడ మీకు సహకరించడం లేదు అనే అంశంపై శ్వేతపత్రం ప్రకటించండి.


రాజధానికోసం అడిగితే డబ్బులు ఇవ్వడం లేదంటున్నారు కదా?
రాజధానిపై డీపీఆర్‌ను ఇంతవరకూ కేంద్ర ప్రభుత్వానికి పంపించారా నాకు తెలీదు. డీపీఆర్ ఇచ్చారా? మాస్టర్ ప్లాన్ అయిపోయిందా? మీరు ఇల్లు కట్టుకోవడానికి బ్యాంకుకు వెళ్లినా, అసలు నీకు స్థలం ఉందా, నీ ప్లాన్ ఏమిటి? అని అడుగుతారు. కేంద్రానిదీ ఇదే పరిస్థితి కదా. అయినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2,050 కోట్లు ఇచ్చింది. వెయ్యి కోట్లు గుంటూరు, విజయవాడ డ్రెయినేజ్ అభివృద్ధికి ఇవ్వగా. మిగిలిన వెయ్యి కోట్లూ సెక్రటేరియట్ వంటి నిర్మాణాలు చెయ్యమనే కదా మీకు ఇచ్చారు. డీపీఆర్‌ని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోయినా కేంద్రం ఈ మొత్తాన్ని ఇచ్చింది.


చంద్రబాబు ప్రభుత్వం ఎలా పనిచేస్తుందని మీరనుకుంటున్నారు?
అభివృద్ధి మొత్తం ఒకేచోట ఉండకూడదు. వికేంద్రీకరణ జరగాలి అని మా భావన. కానీ ఇవ్వాళ జరుగుతున్న పరిణామాలు చూస్తే హైదరాబాద్ విషయంలో జరిగిన తప్పు మళ్లీ పునరా వృతమౌతోందా అనే అనుమానం చాలా మందిలో రాకపోలేదు. అలాంటి అలో చన ఒకటైతే ఉంది.

సింగపూర్ కంపెనీ అని, స్విచ్ చాలెంజ్ అని, అవినీతి ఆరోప ణలు అని విపక్షాలు చాలా విమర్శలు చేస్తున్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై గురుతరమైన  బాధ్యత ఉంటుంది. మీరు ప్రజలకు వివరించి చెప్పాలి. కానీ ఇప్పటివరకు వివరణ రాలేదు. రాజధానికోసం లేదా మచిలీపట్నం డెవలప్‌మెంట్ అథారిటీ కోసం తీసుకునే భూములు కావచ్చు.. అంత పెద్ద మొత్తంలో భూమిని తీసుకుంటు న్నప్పుడు పారదర్శకంగా ఉండాలని చెబుతున్నాం. దీనిపై అంతర్గతంగా కూడా చర్చ చేస్తున్నాం.


 అంటే ప్రభుత్వం పారదర్శకంగా లేదనా?
లక్ష ఎకరాలు మీరు తీసుకుంటున్నప్పుడు అంత భూమి ఎందుక్కావాలి అనే విషయాన్ని ముందు ప్రజలకు వివరించి వారికి నచ్చచెప్పి మీరు తీసుకోవాలి. ఇప్పటికీ కొంతమంది రైతులకు ఆందోళన ఉంది. భూమి ఇవ్వాలని వారికి లేదు. కానీ వారిపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా పారదర్శకంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.


 రాష్ట్ర ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు ఎంతవరకు వాస్తవం?
అవినీతి బాగా ఉందని మాకు సమాచారం అందుతున్న మాట వాస్తవం. భూమి విషయంలో చాలా అనుమానాలున్నాయి. పారదర్శకంగా ముందుకు రావల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. తప్పకుండా దీన్ని మేము మా నాయకత్వం ముందుకు తీసుకెళతాం. రాష్ట్రంలో ఉన్న పరిస్థితులను మేము చర్చించి, పైవారి దృష్టికి కూడా తీసుకెళ్లడమైంది.


విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను ఫిరారుుంపుకు ప్రోత్సహించడం సరైందేనా?
ఈ విషయంలో జరుగుతున్న పరిణామాలు చాలా బాధాకరం. ఏ సందర్భంలో పార్టీ మారుతున్నారన్నది కూడా చూడాలి. విభజన సమయంలో రాష్ట్రానికి న్యాయం జరగలేదని భావించిన వెంటనే నా మంత్రి పదవికి రాజీనామా ఇచ్చాను. తర్వాత ఎంపీ స్థానానికి, పార్టీకి కూడా రాజీనామా చేశాను.

పరిస్థితుల బట్టి జరిగేవి కొన్ని. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జరిగిన ఫిరారుుంపులు వేరు. వాళ్లకున్న ఇబ్బందులు, వారికున్న వ్యాపారాలు కాపా డుకోవడానికి కావచ్చు. కానీ అలాంటి ఫిరాయింపులను ఎవరైనా ఆమోదించే పరిస్థితి ఉంటుందని నేను భావించడం లేదు.


వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీచేస్తే గెలిచే అవకాశం ఉందా?
ప్రభుత్వ వ్యతిరేకత అనేది కచ్చితంగా ఉంటుంది. భూసేకరణ వంటి అంశాలపై వ్యతిరేకత ఉందని చాలామంది నా దృష్టికి తీసుకువచ్చారు. రైతుల, డ్వాక్రా రుణమాఫీలు సరిగా జరగలేదనే బాధ చాలామందిలో ఉంది. అయితే ఎన్నికలు ఆనాటి పరిణామాలపైనే ఆధారపడి ఉంటాయి.


ఈ పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలిసే ఉంటా యనుకుంటున్నారా?
అది అంతిమంగా పార్టీ నాయకత్వం తీసుకోవలసిన నిర్ణయం. రాష్ట్రంలో జరుగుతున్న విషయాలన్నింటినీ వారి దృష్టికి తీసుకెళ్లవలసిన బాధ్యత మాది. 2014లోనే ఒక మంచి అవకాశం ఉందని అందరమూ భావించాం. అప్పుడు ఒంటరిగా పోటీ చేసి ఉన్నట్లరుుతే మాకు కచ్చితంగా మరింత బలం సమకూరేదని ఈ నాటికి కూడా మా అందరి విశ్వాసం. ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో పరిస్థితులను మేమూ బేరీజు వేసుకోవాలి. 2019లో అప్పటి పరిస్థితిని బట్టి మేము అంచనా వేసుకుంటాం.

- (పురందేశ్వరితో ఇంటర్వ్యూ పూర్తి పాఠాన్ని కింది చూడండి)