తెలుగును గౌరవించండి!

4 Jun, 2015 01:09 IST|Sakshi

ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో గల అన్ని ఆదర్శ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని ప్రవేశ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతం ఈ పాఠశాలల్లో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు నిర్వహిస్తున్నారు. దీంతో విద్యార్థులు తమకు ఇష్టం లేన ప్పటికీ బలవంతంగా ఆంగ్ల మాధ్యమాన్ని సైతం ప్రారంభిం చాలన్న విద్యార్థుల తల్లిదండ్రుల డిమాండు గాలిలో కలిసిపో యింది. సక్సెస్ పాఠశాలల తరహాలో ఆదర్శ పాఠశాలల్లో సైతం ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని ప్రవేశపెడితే ప్రయోజన కరంగా ఉంటుంది.
 
 మన రాష్ట్రంలో 155 ఆదర్శ పాఠశాలలున్నాయి. ఇక కస్తూర్బా గాంధీ బాలి కా విద్యాలయాల్లో (కేజీబీవీ) ప్రస్తుత విద్యా సంవత్సరం (2015-16) నుంచి తెలుగు మాధ్యమాన్ని తొల గించి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఆదేశాలను జారీచేసింది. రాష్ట్రంలో మొత్తం 352 కేజీబీవీలుండగా, 18 కేజీబీవీల్లో ఆంగ్ల మాధ్యమం ఇప్పటికే ఉంది. అయితే సవరించిన ఉత్తర్వుల మేరకు మిగిలిన 334 విద్యాలయాల్లో సైతం కొత్త విద్యా సంవత్సరం నుంచి ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశ పెడుతున్నట్టు స్పష్టం చేసింది. ఈ ఉత్త ర్వులు సైతం తెలుగు భాషకు తీరని అన్యాయం చేస్తాయని వేరేగా చెప్పనవసరం లేదు. ఇకనైనా ప్రభుత్వం ఆదర్శ పాఠశా లలతో పాటు కేజీబీవీల్లో ఆంగ్ల భాషకు సమాంతరంగా తెలు గు మాధ్యమాన్ని ప్రవేశపెట్టాలి. ఇందుకోసం శాంతియుతంగా ఉద్యమించాలి.
 వి. కొండలరావు  పొందూరు, శ్రీకాకుళం జిల్లా
 

మరిన్ని వార్తలు