కింది వారిని చూడాలి

20 Feb, 2015 01:44 IST|Sakshi
కింది వారిని చూడాలి

 రుజుమార్గం
 ఈనాడు సమాజంలో నైరాశ్యం రాజ్య మేలుతోంది. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక విధమైన అసంతృప్తి, ఎంత ఉన్నా ఇంకేదో లేదన్న బాధ, మరేదో కావాలన్న ఆశ వారిని ఊపిరి సలపనివ్వడం లేదు. దీనికి కారణం దైవం తమకు ప్రసాదించిన వరాల పట్ల సరైన అవ గాహన, కృతజ్ఞతా భావం లేక పోవడమే.
 ఒకసారి షేక్ సాది (ర) అనే పండితుడు కాలి నడకన ప్రయాణం చేస్తూ ఓ ఊరికి చేరుకున్నాడు. ఈలోపు ఆయనగారి కాలి జోళ్లు తెగిపోయాయి. కొత్తవి కొనుక్కుందా మంటే జేబులో డబ్బులు ఖాళీ.. ఊరు కాని ఊరిలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా బోసి కాళ్లతో ఎలా నడవడం, ఎంత పనైపోయిందీ...? అని పెద్దాయన చాలా బాధపడ్డాడు. అంతలోనే అస లు కాళ్లే లేని ఓ యాచకుడు నేలపై దేకుతూ వెళుతు న్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన షేక్ గారికి జ్ఞానోదయమ యింది. తన కాళ్లకు చెప్పులు లేకపోతేనేం, సలక్షణ మైన రెండు కాళ్లను దైవం తనకు ప్రసాదించాడు. కళ్లు, కాళ్లు, ముక్కు, చెవులు, నోరు తదితర అన్ని అవ యవాలను ఎలాంటి లోపం లేకుండా తయారు చేశా డు. అందమైన ఆకృతితోపాటు, చక్కని ఆరోగ్యాన్నీ అనుగ్రహించాడు.

 ఈ భావన మదిలో కదలగానే అంతకు ముందు కాళ్లకు చెప్పుల్లే వని బాధ పడ్డందుకు షేక్ సాబ్ సిగ్గుతో చితికిపొయ్యాడు. దైవం పట్ల కృతజ్ఞతతో ఆయన మనసు పొంగిపోయింది, విన మ్రతతో శిరస్సు వంగిపోయింది.
 మానవుడి మనస్సు చాలా సంకుచితమైనది. ఎంత ఉన్నా ఇంకా ఏదో లేదన్న వెలితి అతని మన సును కెలుకుతూనే ఉంటుంది. ఒక్కసారి మనం మన చుట్టూ ఉన్న సమాజంపై దృష్టి సారిస్తే, కళ్లులేని వాళ్లు, కాళ్లులేని వాళ్లు, రకరకాల అంగవైకల్యాలతో బాధ పడేవారు, మానసికస్థితి బాగా లేనివాళ్లు, కనీసం ఒక్కపూట తిండికీ నోచుకోని అభాగ్యులు, ఒంటినిం డా బట్టలు, తలదాచుకోడానికి గూడూ లేని వాళ్లు ఎంతటి దీనస్థితిలో బతుకులు వెళ్లదీస్తున్నారో మనకు అర్థమవుతుంది. అలాంటి వారితో పోల్చుకుంటే మనం ఎంత అదృష్టవంతులమో తెలిసివస్తుంది.

 బుద్ధిజీవులమైన మనం ఈ విషయాలను గురిం చి ఆలోచించగలిగితే, సమాజంలోని నిరుపేదలు, నిస్సహాయులు, నిత్యదారిద్య్రంలో భారంగా జీవితాలు వెళ్లదీస్తున్న అభాగ్యుల పట్ల మన బాధ్యత ఏమిటో కూడా తెలుస్తుంది. అందుకని, లేనిదాని కోసం అర్రు లు చాచకుండా, దైవం మనకు ప్రసాదించిన అను గ్రహాలను సద్వినియోగం చేసుకుంటూ, ఆయన పట్ల కృతజ్ఞతతో ఉండాలి. నైతిక, ఆధ్యాత్మిక విషయాల్లో మనకంటే పైవారిని, ప్రాపంచిక విషయాల్లో మన కంటే కిందిస్థాయిలో ఉన్నవారిని చూడాలన్న ప్రవక్త హితోపదేశాన్ని గమనంలో ఉంచుకోవాలి. మనం గనక ఈ విధమైన మంచి ఆలోచనా దృక్పధాన్ని అల వరచుకోగలిగితే ఇహలోక జీవితమూ ధన్యమవుతుం ది, పరలోక జీవితంలోనూ సాఫల్యం సిద్ధిస్తుంది.
 ఎం.డి.ఉస్మాన్ ఖాన్

మరిన్ని వార్తలు