వాళ్ల సినిమాలకు క్షణాల్లో పన్ను మాఫీ... మరి మాకు..?

10 Jan, 2017 02:22 IST|Sakshi
వాళ్ల సినిమాలకు క్షణాల్లో పన్ను మాఫీ... మరి మాకు..?

ఉమ్మడి రాష్ట్రంలోనన్నా మంత్రులు తెలంగాణ వాళ్ళ ఆవేదనను వినేవాళ్ళు. ఒక సందర్భంలో మాజీ సినిమాటోగ్రఫీ మంత్రి డి.కే అరుణను కలసి ‘తెలంగాణ సినిమా చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆమోదం కోసం దరఖాస్తు పెడితే అప్ప టికప్పుడే పచ్చ సిరాతో సంతకం పెట్టి కమిషనర్‌కి ఫార్వర్డ్‌ చేసిన తీరు గుర్తుకు వస్తున్నది. రాష్ట్ర విభజన సందర్భంలో ఆగిన ఆ ఫైలు ఇప్పటిదాకా అలాగే ఉండిపోయింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డ్డాక పరిస్థితి ఊహకందని విధంగా తయారైంది. సీఎంతో సహా ఇతర మంత్రులు కూడా తెలంగాణ వాళ్ళు తీసిన సినిమాలకంటే సీమాంధ్ర నిర్మా తల సినిమాలకే ప్రాధాన్యతనిస్తున్నారు. మోజు పడి భారీ బడ్జెట్‌ సినిమాల వేడు కలకు హాజరు అవుతున్నారు. మరో వైపున తెలంగాణ నిర్మాతలకు సీఎం అపాయింట్‌మెంటే దొరకదు!

అదే ‘రుద్రమదేవి’, ‘గౌతమి పుత్ర శాతకర్ణి’ సినిమాలకు అప్పటికప్పుడే క్షణాలలో పన్ను మాఫీ చేయమని హుకుం జారీ అయిపోయింది. ఆ రెండు సినిమాలు కూడా భారీ బడ్జెట్‌ సిని మాలే. వీటికి ప్రోత్సాహకాలు ఇవ్వడం అవసరమా? ఒక చరిత్ర గాంచిన గొప్ప పేరు పెట్టి సినిమా తీస్తే సరిపోతుందా? వక్రీకరణలు, అసభ్య దృశ్యాలు, అస హజ సన్నివేశాలు, ఎబ్బెట్టు డైలాగులు ఉన్నాయా అని చూడకుండానే జీఓలు పాస్‌ చేస్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. నచ్చిన వారికి  నచ్చిన విధంగా, నచ్చ నివారిని దగ్గరకు రానీయకుండా చేయ డం సబబేనా! వేరుపడ్డాక కూడా తెలం గాణ బిడ్డలపట్ల వివక్ష చూపితే ఎలా?

ఎన్నో తక్కువ బడ్జెట్‌ సినిమాలు , తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే సినిమాలు, తెలంగాణ చరి త్రను, పోరాటాలను తెరకెక్కించిన సినిమాలు  అతికష్టంతో నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు థియేటర్లు  దొర కక, ఒకవేళ అరకొర  థియేటర్లు  దొరి కినా, భారీ అద్దెలు పన్నులు  కట్టలేక, నిలబడలేక  చితికిపోయిన  సినిమాలు  ఎన్నెన్నో ఉన్నాయి, వాటికి పన్నుమాఫీ చేసి ఆదుకుంటే, అది నిజమైన ప్రోత్సా హకం అనబడేది. మేము ప్రొసీజర్‌ ప్రకా రంగా దాఖలుచేసినా మా ఫైల్‌ అంగుళం కూడా జరగదు, అదే కొందరికి అప్పటి కప్పుడే ఉత్తర్వులు జారీ అయిపోతు న్నాయి.

ఎదిగే దశలో ఉన్నవారిపట్ల మెడలు తిప్పుకొని, ఇప్పటికే ఎదిగిపోయిన వారితో మితిమీరిన అలాయ్‌ బలాయ్‌ తీసుకుని, వేదికలు పంచుకుంటున్నారు. రెండేళ్లుగా సీఎం కేసీఆర్‌కి తెలంగాణ చిత్రపరిశ్రమ సమస్యలు దఫదఫాలుగా విడమర్చి చెప్పుకున్నా ఫలితం లేకుండా పోయింది. క్షణాలలో పన్ను మినహా యింపు కొరకు జీవో జారీ చేసినట్లుగా, తెలంగాణ భూమిపుత్రుల కోసం ఒక ప్రత్యేక సినిమా పాలసీని రూపొందించ మని కోరుకుంటున్నాం!
- సయ్యద్‌ రఫీ, సినీదర్శకుడు, తెలంగాణ చిత్ర పరిశ్రమ

మరిన్ని వార్తలు