బీజేపీలోకి 10 మంది ఎమ్మెల్యేలు 

14 Aug, 2019 02:03 IST|Sakshi

గ్యాంగ్‌టక్‌: ఈశాన్య రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో లేని లేదా అధికార సంకీర్ణంలో లేని రాష్ట్రం సిక్కిం ఒక్కటే. తాజాగా ఆ రాష్ట్రంలోనూ అధికారాన్ని చేజిక్కించుకునే దిశగా కమలదళం అడుగులు వేస్తోంది. అందులో భాగంగానే సిక్కిం డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌(ఎస్‌డీఎఫ్‌)కు చెందిన 10 మంది ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుంది. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా, ఈశాన్య రాష్ట్రాల పార్టీ ఇన్‌చార్జి రాంమాధవ్‌ల సమక్షంలో మంగళవారం వారు బీజేపీలో చేరారు. ప్రస్తుతం సిక్కింలో ఎస్‌కేఎం అధికారంలో ఉంది.

ఇటీవలి ఎన్నికల్లో మొత్తం 32 స్థానాలకు గానూ 17 సీట్లను ఎస్‌కేఎం గెలుచుకుంది. పవన్‌ కుమార్‌ చామ్లింగ్‌ నేతృత్వంలోని సిక్కిం డెమొక్రాటిక్‌ ఫ్రంట్‌ 15 సీట్లను గెలుచుకుంది. వారిలో ఇద్దరు రాజీనామా చేయడంతో ఆ పార్టీకి ప్రస్తుతం 13 మంది ఎమ్మెల్యేలే ఉన్నారు. వారిలో 10 మంది ఇప్పుడు బీజేపీలో చేరడంతో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలుచుకోని బీజేపీకి ఇప్పుడు సిక్కిం లో ప్రధాన ప్రతిపక్ష హోదా లభించనుంది. మూడింట రెండు వంతులకు పైగా ఎమ్మెల్యేలు బీజేపీలో చేరినందున ఫిరాయింపుల నిరోధక చట్టం వారికి వర్తించదు. రాష్ట్రంలో నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని రాంమాధవ్‌ చెప్పారు. 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నీళ్లొస్తున్నాయని ఊరిస్తున్నారు: దత్తాత్రేయ 

ఖర్చు చేసిందెంత.. చేయాల్సిందెంత?: లక్ష్మణ్‌  

మీవి విద్వేష రాజకీయాలు 

అట్టుడుకుతున్న హాంకాంగ్

ఆర్టికల్‌ 370 రద్దు.. మౌనం వీడిన ప్రియాంక గాంధీ

చంద్రబాబు ఓర్వలేకపోతున్నారు : బొత్స

టీడీపీ కీలక భేటీ.. గంటా, కేశినేని డుమ్మా

‘విమానం కాదు.. స్వేచ్ఛ కావాలి’

సీఎం జగన్‌ కీలక నిర్ణయం; టీడీపీకి టెన్షన్

కశ్మీర్‌పై వైగో సంచలన వ్యాఖ్యలు

రజనీకాంత్‌ ప్రశంసలు.. కాంగ్రెస్‌ ఫైర్‌

ఓర్వలేక దుష్ప్రచారం చేస్తున్నారు

తలైవా చూపు బీజేపీ వైపు..?

అలా అయితే ఆర్టికల్‌ రద్దయ్యేదా?: చిదంబరం

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు

బీజేపీలోకి రెజ్లర్‌ బబిత

టీఆర్‌ఎస్‌కు తోక పార్టీగా కాంగ్రెస్‌

కొత్త అధ్యాయాన్ని లిఖిస్తాం

జనసేన ఎమ్మెల్యేపై కేసు నమోదు..!

‘బిర్యానీ తినడానికి టైమ్‌ ఉంది కానీ..’

అలా చేయడం తప్పే అవుతుంది : విజయ్‌ సేతుపతి

చంద్రబాబును కలిసిన బోండా ఉమ

ఒకవేళ కశ్మీర్‌లో హిందువులు ఎక్కువగా ఉంటే..

‘గోవుల మృతి వెనుక కుట్రకోణం’

‘ఆ నేతల అసలు రంగు ఇదే’

బీజేపీలోకి ప్రముఖ క్రీడాకారిణి!

‘భారతీయుడినని సగర్వంగా చెప్పుకునేలా చేశాడు’

కమలం గూటికి మోత్కుపల్లి?

జేజేపీ–బీఎస్పీ పొత్తు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

జెర్సీ రీమేక్‌లో అమలాపాల్‌!

ప్రేమకథ మొదలు

‘ఎవరూ నమ్మనప్పుడు పీవీపీగారు నన్ను నమ్మారు’

నాకు తెలిసిందే తీస్తా!

‘స్టార్‌ని చేయాలనే పెద్ద సినిమాలు చేయించా ’

ప్రపంచాన్ని శాసించగల సినిమాలు తీయగలం: పవన్‌