పంజరంలో చిలుకలా ఈసీ: రౌత్‌

20 Nov, 2023 06:28 IST|Sakshi

ముంబై: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘం కూడా పంజరంలో చిలుకలా మారిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్‌ రౌత్‌ ఆరోపించారు. అన్ని విషయాల్లోనూ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ‘‘ఉచితంగా అయోధ్య రామ మందిర దర్శనం కలి్పస్తామని ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పదేపదే చెబుతున్నా ఈసీ పట్టించుకోవడం లేదు.

అదే హామీ విపక్షాలు ఇస్తే వెంటనే షోకాజ్‌ నోటీసులిచ్చేది’’ అంటూ పార్టీ పత్రిక సామ్నాకు రాసిన వ్యాసంలో రౌత్‌ విమర్శించారు. మోదీ హయాంలో భారత క్రికెట్‌ పూర్తిగా ఆయన స్వరాష్ట్రం గుజరాత్‌కు తరలిపోయిందని ఆరోపించారు. ‘‘గతంలో దేశ క్రికెట్‌కు ముంబై ప్రధాన కేంద్రంగా ఉండేది. ఇప్పుడంతా అహ్మదాబాద్‌మయం! ప్రపంచ కప్‌ ఫైనల్‌ కూడా అక్కడే జరుగుతోంది! స్వీయ రాజకీయ లబ్ధి కోసం చివరికి క్రికెట్‌ను కూడా కూడా మోదీ సర్కారు పొలిటికల్‌ ఈవెంట్‌గా మార్చేసింది’’ అని ఎద్దేవా చేశారు. 

మరిన్ని వార్తలు