వైఎస్సార్‌సీపీలో పలువురి చేరిక

21 Aug, 2018 09:11 IST|Sakshi

సాక్షి, పాయకరావుపేట : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. భరోసా నింపేందుకు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నంలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత చేపట్టిన పాదయాత్ర 242వ రోజు మంగళవారం ఉదయం.. విశాఖపట్నం జిల్లా పాయకరావుపేట నియోజకవర్గ కైలాసపట్నం శివారు నుంచి ప్రారంభమైంది. కైలాసపట్నం దగ్గర మహిళలు బారులు తీరి... వైఎస్‌ జగన్‌కు స్వాగతం పలికారు. అక్కడ నుంచి చౌడువాడ క్రాస్‌, గొట్టివాడ, పండూరు క్రాస్‌ మీదుగా రామచంద్రపురం క్రాస్‌ వరకు పాదయాత్ర కొనసాగనుంది. లంచ్‌ విరామం అనంతరం తిరిగి పాదయాత్ర ప్రారంభమవుతుంది. దార్లపూడి జంక్షన్‌ మీదుగా దార్లపూడి వరకు వైఎస్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగిస్తారు. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ పాదయాత్ర సాగిస్తున్నారు.

200 మంది పార్టీలో చేరిక..
విశాఖ జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్రలో ఆయనను కలిసేందుకు వేలాది మంది తరలివస్తున్నారు. ప్రజల కోసం వైఎస్‌ జగన్‌ పడుతున్న కష్టాలను చూసి పలువురు పార్టీలో చేరడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇవాళ రిటైర్డ్‌ ఎస్పీ ప్రేమ్‌బాబు, టీడీపీ నాయకులు గెడ్డమూరి రమణ, మునగాడ చిరంజీవితోపాటు 200మంది కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరారు. ప్రజల కోసం కష్టపడుతున్న ఏకైక నాయకుడు వైఎస్‌ జగన్‌ మాత్రమేనని వారు అన్నారు. కాగా, పండూరు క్రాస్‌, రామచంద్రాపురం క్రాస్‌ మీదుగా పాదయాత్ర సాగుతోంది. దార్లపూడి వరకు పాదయాత్ర కొనసాగనుంది. వైఎస్‌ జగన్‌పై ఉన్న అభిమానంతో పలువురు ఆయనపై పాటలు రూపొందించి పాడారు. పాటల ద్వారా వైఎస్సార్‌సీపీ ప్రత్యేకతలను చాటిచెప్పారు.

మరిన్ని వార్తలు