బీజేపీలో చేరిక ఆఖరిలో వాయిదా

15 Apr, 2019 10:20 IST|Sakshi
నటి రాగిణి ద్వివేది

యశవంతపుర: ప్రముఖ హీరోయిన్‌ రాగిణి ద్వివేది బీజేపీలో చేరిక అనూహ్యంగా వాయిదా పడింది. ఆమె ఆదివారం బీజేపీ ఎమ్మెల్యే సీఎస్‌ ఆశ్వర్థ నారాయణ కార్యాలయంలో బీజేపీలో చేరతారని పార్టీ వర్గాలు ప్రకటించాయి. ఆమె ఈ విషయమై గత వారం బీజేపీ ముఖ్య నేతలతో  చర్చించినట్లు సమాచారం. వారి నుంచి ఆమోదం వచ్చిందని, ఆమె కాషాయ కండువా వేసుకోవడమే ఆలస్యమని వార్తలు గుప్పుమన్నాయి. దీంతో ఎమ్మెల్యే కార్యాలయం వద్ద హంగామా మొదలైంది. ఇంతలో ఏమైందోకానీ సాయంత్రానికి పార్టీలో చేరిక వాయిదా పడిందని తెలిసింది. పార్టీ నాయకుడు అరవింద లింబావళి, మురళీధర్‌రావ్‌లు అందుబాటులో లేనందున వాయి పడిన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

మరిన్ని వార్తలు