పది తలలున్న పెద్ద రాక్షసుడు చంద్రబాబు!

19 Jun, 2018 12:58 IST|Sakshi

నాయిబ్రాహ్మణుల పట్ల ఆయన తీరు ఆక్షేపణీయంఅంబటి రాంబాబు మండిపాటు

సాక్షి, గుంటూరు : నాయిబ్రాహ్మణులతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట్లాడిన తీరు ఆక్షేపణీయమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బెదిరింపులకు దిగటం దారుణమని ఆయన మండిపడ్డారు. నాయి బ్రాహ్మణులు చాలా సౌమ్యులని, అలాంటి వారిపై చంద్రబాబు వీరత్వం చూపాలనుకున్నారని తప్పుబట్టారు. మంగళవారం ఆయన మాటాడారు.  ‘కేంద్రంపై పోరాటమంటూ వారంరోజులుగా చంద్రబాబు తెగ ప్రచారం చేసుకున్నారు. చివరకు ఉరుమురిమి మంగలం మీద పడ్డట్టు చంద్రబాబు నాయి బ్రాహ్మణుల మీద పడ్డారు. ప్రజాదేవాలయంలో చంద్రబాబు ప్రవర్తన దేవునిలా లేదు.ఆయన పది తలలున్న పెద్ద రాక్షసుడు’ అని అంబటి దుయ్యబట్టారు.


జాలర్లు, బ్రాహ్మణుల మీద కూడా ఆయన దౌర్జన్యం చేశారని గుర్తుచేశారు. వివిధ వర్గాల ప్రజల ఉద్యమాలను అణచివేయడం తప్ప వారి సమస్యలను చంద్రబాబు ఎప్పుడైనా పరిష్కరించారా? నిలదీశారు. ఇంటిలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పచ్చచొక్కా వేసుకోవడం మంచిదని, ఆయనకు మహానాడులో సన్మానం చేయాలని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేతల ఫోన్ ట్యాప్ చేయటం, అసంతృప్తవాదులను సీఎం దగ్గరకు తీసుకెళ్లటమే ఆయన పనిగా పెట్టుకున్నారని మండిపడ్డారు. నాయి బ్రాహ్మణులను రాత్రి పిలిపించి బలవంతంగా సమ్మె విరమింపచేశారని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు