బదిలీకి కారణాలు అవసరం లేదు : ఈసీ

28 Mar, 2019 19:30 IST|Sakshi

సాక్షి, అమరావతి : ఎస్పీల బదిలీకి ఎలాంటి కారణాలు అవసరం లేదని ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాల కృష్ణ ద్వివేది స్పష్టం చేశారు. గురువారం ఇక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... నామినేషన్‌ల ఉపసంహరణ గడువు ముగిసింది.. ఎంతమంది బరిలో ఉన్నారనే దానిపై సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. సాధారణ రోజుల్లో జరిగే బదిలీలకు ఎలాంటి కారణాలు చెప్పరని పేర్కొన్నారు. ఉద్యోగులకు బదిలీలు, సస్పెన్షన్లు శిక్ష కాదన్నారు. ఆరోపణలు పరిగణనలోకి తీసుకుంటే విచారణ జరిగేది.. బదిలీ చేసింది సీఈసీ అయితే తనకు లేఖ రాయడం వల్ల ప్రయోజనమేంటని ఆయన ప్రశ్నించారు.

అంతేకాక సిట్ అధికారులు అడిగిన అన్నింటికి వివరణ ఇచ్చాం అని గోపాల కృష్ణ తెలిపారు. ఎన్నికల గుర్తులు మార్చడం అనేది ఇప్పుడు వీలు కాదన్నారు. కేఏ పాల్‌కు భద్రత పెంచమని పోలీసులకు సూచించామని తెలిపారు. జగన్ బెయిల్ రద్దు తమ పరిధిలోఉండదని.. కోర్టును ఆశ్రయించాలని సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా వేలాది మందిపై బైండ్ఓవర్ కేసులు పెట్టినట్లు చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు