బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోవాలి..

5 Jun, 2020 14:48 IST|Sakshi

సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తీరుపై ప్రభుత్వ విప్ కోరుముట్ల శ్రీనివాస్ విమర్శలు గుప్పించారు. బాలకృష్ణ వాస్తవాలు తెలుసుకోకుండా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాలకృష్ణ మానసిక పరిస్థితి బాగోలేదని గతంలో డాక్టర్లు చెప్పారని ఆయన గుర్తు చేశారు. ఆయన మానసిక పరిస్థితిపై అనుమానాలు ఉన్నాయని, దీనిపై ప్రభుత్వానికి లేఖ రాస్తున్నానని తెలిపారు.

పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ..‘బాలకృష్ణ ఎమ్మెల్యేగా అనర్హుడు. ఆయన వ్యవహార శైలితో హిందూపురం ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎన్టీఆర్ కుమారుడిగా బాలకృష్ణపై అందరికీ అభిమానం ఉంది. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును బాలకృష్ణ భుజాన మోస్తున్నారు. చంద్రబాబు చచ్చిన పాము వంటివాడు. ఏడాదిలోనే దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్ పేరు తెచ్చుకున్నారు. తొలి ఏడాదిలోనే అద్భుతాలు సృష్టించిన ముఖ్యమంత్రి రానున్న నాలుగేళ్లలో ఇంకా ఎలాంటి అద్భుతాలు సృష్టిస్తారో టీడీపీ నేతలు గ్రహించాలి. చంద్రబాబు జూమ్ బాబుగా మారిపోయాడు’అని కోరుముట్ల శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. (చదవండి: బాలకృష్ణలో ఆ బాధ కనిపిస్తోంది : ఇక్బాల్‌)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు