‘బీసీ’ల నారాజ్‌..!

8 Mar, 2019 11:52 IST|Sakshi

సాక్షి, జనగామ:  జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లలో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు దక్కాయి. జిల్లావ్యాప్తంగా 12 జెడ్పీటీసీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్ర మే బీసీ మహిళకు కేటాయిం చారు. 12 ఎంపీపీ స్థానాల్లో బచ్చన్నపేట మాత్రమే బీసీలకు కేటాయించారు. 

రెండు మండలాల్లో నిల్‌..

జిల్లా వ్యాప్తంగా 140 ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు 18 మాత్రమే దక్కాయి. నర్మెట, కొడకండ్ల మండలాల్లో బీసీలకు ఒక్కస్థానం కూడా దక్కలేదు. నర్మెటలో ఏడు, కొడకండ్లలో తొమ్మిది ఎంపీటీసీ స్థానాలు ఉండగా ఒక్కటి కూడా బీసీలకు దక్కలేదు. దీంతో ఈ రెండు మండలాల్లో బీసీలకు ప్రాతినిధ్యం లేకుం డాపోయింది.

చిల్పూర్, రఘునాథపల్లి, దేవరుప్పుల, తరిగొప్పుల మండలాల్లో ఒక్కో స్థానం మాత్రమే బీసీలకు రిజర్వయ్యాయి. బచ్చన్నపేట మండలంలో మాత్రం బీసీలకు ఎక్కువ స్థానాలు దక్కాయి. బచ్చన్నపేటలో జెడ్పీటీసీ, ఎంపీపీ రెండు బీసీలకే దక్కాయి. అత్యధికంగా నాలుగు ఎంపీటీసీ స్థానాలు బీసీలకు దక్కడం విశేషం. 

బీసీలకు కేటాయించిన స్థానాలు

బచ్చన్నపేట      జెడ్పీటీసీ     బీసీ మహిళ
బచ్చన్నపేట      ఎంపీపీ     బీసీ మహిళ

బీసీలకు కేటాయించిన ఎంపీటీసీ స్థానాలు..

చిల్పూర్‌         (బీసీ మహిళ)
బచ్చన్నపేట–1(చిల్పూర్‌) (బీసీ జనరల్‌)
కేశిరెడ్డిపల్లి(చిల్పూర్‌) (బీసీ జనరల్‌)
కొన్నె(చిల్పూర్‌)     (బీసీ మహిళ)
లింగంపల్లి (చిల్పూర్‌) (బీసీ మహిళ)
కోలుకొండ(దేవరుప్పుల) (బీసీ మహిళ)
స్టేషన్‌ ఘన్‌పూర్‌–1(దేవరుప్పుల) (బీసీ జనరల్‌), 
ఇప్పగూడెం(దేవరుప్పుల (బీసీ మహిళ)
గానుపహాడ్‌(జనగామ) (బీసీ మహిళ)
పెంబర్తి(జనగామ) (బీసీ జనరల్‌)
నవాబుపేట(జనగామ) (బీసీ జనరల్‌)
మాణిక్యపురం(జనగామ) (బీసీ మహిళ)
జఫర్‌గఢ్‌–1(జనగామ) (బీసీ మహిళ)
తమ్మడపల్లి (జి)(జనగామ) (బీసీ జనరల్‌)
అబ్ధుల్‌నాగారం(తరిగొప్పుల) (బీసీ మహిళ)
గబ్బెట(రఘునాథపల్లి)   (బీసీ మహిళ)
పాలకుర్తి–1(రఘునాథపల్లి)   (బీసీ మహిళ)
లక్ష్మీనారాయణపురం(రఘునాథపల్లి)   (బీసీ జనరల్‌)  

నిరాశలో బీసీ నేతలు..

జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాల్లో బీసీలకు రిజర్వేషన్లలో తక్కువ స్థానాలు రిజర్వు కావడంతో బీసీ నాయకులను నిరాశ పర్చింది. ప్రధాన పార్టీల్లో బీసీలు ద్వితీయ శ్రేణి నాయకులుగా రాణిస్తున్నారు. గ్రామ, మండల స్థాయిల్లో ప్రజాప్రతినిధులు ఎన్నికై ప్రజలకు సేవ చేద్దామని ఆలోచించిన బీసీ నాయకులకు రిజర్వేషన్‌ కలిసి రాకపోవడంతో ఆశ నిరాశగా మారింది. దీంతో మెజార్టీ బీసీ నాయకులు పోటీకి దూరం కావాల్సి రావడంతో నారాజ్‌ అవుతున్నారు. 

మరిన్ని వార్తలు