...ఆ రెండు

22 Mar, 2019 08:05 IST|Sakshi

దత్తాత్రేయకు నిరాశ.. లక్ష్మణ్‌కు మొండిచేయి  

హైదరాబాద్, చేవెళ్లపై సస్పెన్స్‌

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచే బీజేపీ అభ్యర్థులను అధిష్టానం గురువారం రాత్రి ప్రకటించింది. అంతా ఊహించినట్లే  సికింద్రాబాద్‌ నుంచి ఈసారి ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డిని బరిలోకి దించింది. మల్కాజిగిరి సెగ్మెంట్‌ నుంచి ఎమ్మెల్సీ రామచందర్‌రావు పేరును ఖరారు చేసింది. ఇక హైదరాబాద్, చేవెళ్ల లోక్‌సభ స్థానాలను పెండింగ్‌ పెట్టారు. ఈ స్థానాలపై ఇంకా ఉత్కంఠ కొనసాగుతోంది. తమ నేతలకు టికెట్లు ఖరారు కావడంతో అభిమానులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు. 

దత్తన్నకు దక్కని అవకాశం
సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఇప్పటికే మూడుసార్లు ఎంపీగా గెలిచి, రెండుసార్లు కేంద్రమంత్రిగా పనిచేసిన ప్రస్తుత సిట్టింగ్‌ ఎంపీ బండారు దత్తాత్రేయను అధిష్ఠానంపక్కనబెట్టింది. ఆయన స్థానంలో కొత్తగా కిషన్‌రెడ్డికి అవకాశం కల్పించడంతో దత్తత్రేయ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. సీనియర్‌ను, సిట్టింగ్‌ను కాదని కొత్తవారికి ఎలా అవకాశం ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉండగా ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నించిన పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌కు చివరకు నిరాశే మిగిలింది. ఇక హైదరాబాద్‌ స్థానంలో ఎవరిని బరిలోకి దించాలనే అంశంపై పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడుతోంది.

మల్కాజిగిరి బీజేపీ అభ్యర్థి
పేరు: నారపరాజు రామచందర్‌రావు
పుట్టిన తేదీ: 27–04–1959
తల్లిదండ్రులు: రాఘవ సీత, ఎన్‌వీఆర్‌ఎల్‌ఎన్‌ రావు
విద్యార్హత: ఎంఏ, ఎల్‌ఎల్‌బీ
భార్య: సావిత్రి   
పిల్లలు: అవనీష్, నిశ్చల

రాజకీయ ప్రస్తానం..
1977–80: మూడుసార్లు రైల్వే డిగ్రీ కళాశాల యూనియన్‌ అధ్యక్షుడు
1983–85: ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీ పధాన కార్యదర్శి  
1992–94: క్రిమినల్‌ కోర్టు బార్‌ అసోసియోషన్‌ కార్యదర్శి  
2000–2002: క్రిమినల్‌ కోర్టు బార్‌ అసోసియోషన్‌ అధ్యక్షుడు  
2012: భారత బార్‌ కౌన్సిల్‌ సభ్యుడు  
2012–2015: ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు  
2012: బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా సభ్యుడు  
2011: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయవాది  
2014: మల్కాజిగిరి నుంచి బీజేపీ, టీడీపీ మిత్రపక్షాల అభ్యర్థిగా పోటీచేసి ఓటమి  
2015: హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఎన్నిక  
2018: మల్కాజిగిరి ఎమ్మెల్యేగా పోటీ, ఓటమి

సికింద్రాబాద్‌ బీజేపీ అభ్యర్థి
పేరు: జి. కిషన్‌రెడ్డి
పుట్టిన తేదీ: 15 మే 1964
కుటుంబం: భార్య కావ్య
పిల్లలు: తన్మయ్, వైష్ణవి
వృత్తి: వ్యాపారం
స్వగ్రామం: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కందుకూర్‌ మండలం తిమ్మాపూర్‌  
1980లో బీజేపీ కార్యకర్తగా రాజకీయ ప్రాస్థానం, అదే ఏడాది ఉమ్మడి రంగారెడ్డి జిల్లా యువమోర్చా కన్వీనర్‌గా నియామకం  
1982–83లో బీజేవైఎం రాష్ట్ర కోశాధికారి
1986–90లో బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు  
1990–92లో బీజేవైఎం జాతీయ కార్యదర్శి,   దక్షణ భారతదేశం పార్టీ ఇన్‌చార్జి
1994–2001 మధ్య బీజేవైఎం జాతీయ ప్రధాన కార్యదర్శి
2001–2002లో బీజేపీ ఏపీ అధికార ప్రతినిధి, కోశాధికారి  
2002–2004లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడు
1999లో కార్వాన్‌ నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి ఓటమి  
2004లో హిమాయత్‌నగర్‌ నుంచి ఎమ్మెల్యేగా విజయం
2009, 2014 అంబర్‌పేట నుంచి ఎమ్మెల్యేగా విజయం  
మూడు సార్లు  బీజేపీ శాసన సభాపపక్ష నాయకుడు  
2018లో అంబర్‌పేట నుంచి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి 

మరిన్ని వార్తలు