హమీలను తక్షణమే నెరవేర్చాలని డిమాండ్‌

21 Jan, 2019 11:02 IST|Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించారు. తాడేపల్లి గూడెంలో ‘ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల సాధనకై పోరుబాట’ పేరుతో సోమవారం ఉదయం దీక్షను ప్రారంభించారు. తొలుత తెలుగుతల్లికి, బీజేపీ వ్యవస్థాపక నేతలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పైడికొండల మాట్లాడుతూ.. జిల్లాకు ఇచ్చిన 56 హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు.

గత నెల 25ననే చంద్రబాబు నాయుడుకి రాజీనామా అల్టిమేటం పంపినట్లు తెలిపారు. నెల రోజులు దాటినప్పటికి ముఖ్యమంత్రి స్పందించకపోవడంతో ఈ రోజు నుంచి దీక్ష ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. మాణిక్యాలరావుతో పాటు బీజేపీ నేతలు నరిశె సోమేశ్వర్రావు, ఈతకోట తాతాజీ, వట్టి శైలజ, కర్రి ప్రభాకర్‌ బాలాజీ తదితరులు దీక్షలో పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు