వరాలపై ఉత్కంఠ : నేడు బీజేపీ మ్యానిఫెస్టో

8 Apr, 2019 08:16 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల తొలివిడత పోలింగ్‌ సమీపిస్తున్న క్రమంలో బీజేపీ సోమవారం తన ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేయనుంది. బీజేపీ మ్యానిఫెస్టో ప్రధానంగా ఉగ్రవాదం, అభివృద్ధి, మహిళా సాధికారత, రామమందిర నిర్మాణం వంటి అంశాలపై దృష్టిసారించనుంది. మరోవైపు కనీస ఆదాయ హామీ పధకం (న్యాయ్‌) కింద అత్యంత పేద కుటుంబాలకు ఏటా రూ 72,000 నగదు సాయం చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో పేదరిక నిర్మూలనపై కాషాయ పార్టీ తన మ్యానిఫెస్టోలో ఏ అంశాలను చేర్చుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

ఇక నిరుద్యోగ సమస్య దేశాన్ని పట్టిపీడిస్తుండటంతో యువతకు ఉపాధి, నైపుణ్యాల కల్పనపైనా బీజేపీ మ్యానిఫెస్టో ఎలాంటి ప్రస్తావన తీసుకువస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక పార్టీ మ్యానిఫెస్టో విడుదల కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా, కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ సహా పలువురు సీనియర్‌ నేతలు పాల్గొంటారు.

మరిన్ని వార్తలు