కాంగ్రెస్‌తో జట్టు కట్టలేదు : కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా

28 Mar, 2018 09:38 IST|Sakshi
కేంబ్రిడ్జ్‌ ఎనలిటికాపై ఆరోపణలు చేసిన మాజీ ఉద్యోగి వైలీ

లండన్‌ : ఫేస్‌బుక్‌ డేటాను సంగ్రహిస్తుందనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బ్రిటన్‌ కంపెనీ కేంబ్రిడ్జ్‌ ఎనలిటికా భారత్‌లో కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిందనే ప్రచారాన్ని తోసిపుచ్చింది. భారత్‌లో ఈ సంస్థ కార్యకలాపాలు సాగాయని, కాంగ్రెస్‌ పార్టీకి సేవలందించిందని కంపెనీ మాజీ ఉద్యోగి క్రిస్టోఫర్‌ వైలీ చేసిన ఆరోపణలను ఖండించింది. భారత్‌లో కేంబ్రిడ్జ్‌ అనలిటికా విస్తృతంగా కార్యకలాపాలు సాగించిందని, అక్కడ సంస్థకు కార్యాలయం ఉందని, సిబ్బంది ఉందని వైలీ బ్రిటన్‌ పార్లమెంటరీ కమిటీకి నివేదించారు.

కాంగ్రెస్‌ పార్టీ కేంబ్రిడ్జ్‌కు క్లైంట్‌ అని తనకు సమాచారం ఉందన్నారు. కాగా, పార్ట్‌టైమ్‌ కాంట్రాక్టర్‌గా పనిచేసిన వైలీ 2014, జులైలోనే సంస్థ నుంచి వైదొలిగారని, అప్పటినుంచి కంపెనీ కార్యకలాపలు, పద్ధతుల గురించి వైలీకి తెలియదని కంపెనీ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. బ్రిటన్‌ పార్లమెంటరీ కమిటీ ఎదుట ఆయన చెప్పినవన్నీ కేవలం ఊహాగానాలేనని కేం‍బ్రిడ్జ్‌ అనలిటికా పేర్కొంది. 

>
మరిన్ని వార్తలు