సత్యవేడులో బాబు ఫ్లాప్‌ షో

26 Mar, 2019 13:27 IST|Sakshi
సత్యవేడు సభలో ప్రసంగిస్తున్న చంద్రబాబు

తమ్ముళ్లూ గెలిపిస్తారా?

మంచి గాలి, ఆహారం, నీళ్లు అందజేస్తా

చర్చనీయాంశంగా చంద్రబాబు నాయుడి ప్రసంగం

మద్యం ఏరులై పారినా.. జనం లేక సభ వెలవెల

చిత్తూరు, సత్యవేడు: టీడీపీ అధినేత సత్యవేడులో నిర్వహించిన రోడ్‌ షోకు జన స్పందన కరువైంది. ఈ సభలో ఆయన ప్రసంగాన్ని విన్న జనం ముక్కున వేలేసుకున్నారు. సత్యవేడు గడియారం సర్కిల్‌ వద్ద సోమవారం మధ్యాహ్నం 3.48 నుంచి 4.11 గంటల వరకు చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన ‘తమ్ము ళ్లూ.. సత్యవేడులో టీడీపీని గెలిపిస్తారా’ అంటూ అపనమ్మకంతో తన ప్రసంగాన్ని ప్రారంభించా రు. గెలిపిస్తే మంచి గాలి, ఆహారం, నీళ్లు అందజేస్తామన్నారు. మంచి గాలి, నీరు, ఆహారానికి సంబంధం ఏమిటంటూ ఆ పార్టీ నాయకులే చర్చించుకుంటున్నారు. అయితే జన స్పందన లేకపోవడంతోఆయన అసంతృప్తి చెందారు. మద్యం ఏరులై పారినా జనం లేక సభ వెలవెలబోయింది. జన సమీకరణ జరగలేదని గుర్తించిన ఆయన రెండు గంటల పాటు ఆలస్యంగా వచ్చినట్లు సమాచారం. చంద్రబాబు రోడ్‌ షో సత్యవేడులో ఫ్లాప్‌ అంటూ స్థానికులు గుసగుసలాడారు. ఎన్నో ఉద్యోగాలు ఇచ్చినట్లు గొప్పలు చెప్పుకున్నారు.

శ్రీసిటీపై అసత్యాలు
సత్యవేడుకు శ్రీసిటీని తానే ఇచ్చానని అన్నారు. 2008లో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు శ్రీసిటీ వస్తే చంద్రబాబు ఇచ్చినట్లు చెప్పడంపై సొంత పార్టీ నేతలే తప్పుపడుతున్నారు. సత్యవేడుకు గోదావరి నీళ్లు ఇస్తామని వెల్ల డించారు. మంచి మెజారిటీ ఇస్తే సత్యవేడును రెండో కుప్పంగా మార్చుతామని హామీలు గుప్పించారు. ప్రసంగానికి జనం నుంచి స్పందన లేకపోవడంతో సీఎం నిరుత్సాహానికి గురయ్యారు. ఇదిలా ఉండగా టీడీపీ సత్యవేడు ఎమ్మెల్యే తలారి ఆదిత్యతో పాటు ఆయన అనుచరులు చంద్రబాబు సభకు హాజరుకాలేదు. తిరుపతి టీడీపీ ఎంపీ అభ్యర్థి పనబాక లక్ష్మి, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి జేడీ రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు