కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తా : జగ్గారెడ్డి

24 Sep, 2018 21:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : కక్షసాధింపు చర్యల్లో భాగంగానే కేసీఆర్‌ తనను అరెస్ట్‌ చేయించారని కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి ఆరోపించారు. మానవ అక్రమ రవాణా కేసులో అరెస్టయిన ఆయన సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజకీయంగా ప్రజలు తనను ఆశ్వీరదిస్తే కేసీఆర్‌కు చుక్కలు చూపిస్తానన్నారు.
 
అసలు ఈ కేసులో తన పేరు లేదని, హరీష్ రావు, కేసీఆర్ పేర్లు ఉన్నాయని జగ్గారెడ్డి తెలిపారు. తనపై మోపిన అభియోగంపై న్యాయపోరాటం చేస్తానన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద నేరారోపణలు, కేసులు లేవా అని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే నేరమైందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉండొచ్చేమో కానీ.. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే విషయాన్ని కేసీఆర్ గుర్తుంచుకోవాలని  హెచ్చరించారు. పోలీసులు కూడా పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రజలను అణగదొక్కే నాయకులు కావాలో ప్రజలే నిర్ణయించాలని అన్నారు.
 

జగ్గారెడ్డికి బెయిల్‌ మంజూరు

జగ్గారెడ్డి అరెస్ట్‌

మరిన్ని వార్తలు