సీపీఎం వ్యాఖ్యలు: చంద్రబాబు సమాధానం

27 Mar, 2018 14:14 IST|Sakshi
సీపీఎం మధు, సీఎం చంద్రబాబు (పాత​ ఫొటోలు)

అమరావతిలో అఖిల సంఘాల భేటీ

సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో సచివాలయంలో మంగళవారం అఖిల సంఘాల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర విభజన సమస్యలు, విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి ఇచ్చిన హామీలపై ఈ భేటీలో చర్చించారు. ఈ సమావేశంలో పాల్లొన్న సీపీఎం నేత మధు మాట్లాడుతూ.. ‘దేశంలో ఏ రాష్ట్రానికీ జరగని అన్యాయం ఆంధ్రప్రదేశ్‌కు జరిగింది. పార్లమెంటులో చేసిన చట్టాన్ని కూడా అమలు చేయడం లేదని, ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నాలుగేళ్లు అఖిలపక్ష సమావేశాలు జరిపి ఉంటే బాగుండేది. మరోవైపు బీజేపీ అధ్యక్షడు అమిత్‌షా రాజకీయ స్కోరు కోసం లేఖ రాశారు. ఫెడరల్ స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించడం బీజేపీ లక్ష్యమ’ని అభిప్రాయపడ్డారు.

మధు వ్యాఖ్యలకు చంద్రబాబు సమాధానం
సీపీఎం నేత మధు చేసిన వ్యాఖ్యలకు చంద్రబాబు నాయుడు సమాధానమిచ్చారు. నాలుగేళ్లు తర్వాత రాష్ట్రానికి ఇవ్వాల్సింది అడిగితే ఇంత పెడసరిగా వెళుతున్నవారు.. తొలిరోజు నుంచే తాను దూకుడుగా వెళ్లి వుంటే రాష్ట్రానికి ఇంకా అన్యాయం జరిగేది కాదా అన్నారు. అలా జరిగి ఉంటే ‘సీఎం కాస్త ఓపిక పట్టి వుంటే బావుండేది, దూకుడుగా వెళ్లకుండా నెమ్మదిగా ప్రయోజనాలు రాబట్టుకుంటే బావుండేది. దూకుడుగా వెళ్లి రాష్ట్ర ప్రయోజనాలకు అన్యాయం చేశార’ని అప్పుడు మీరే అనేవారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్‌ పసిగుడ్డు లాంటి రాష్ట్రమని, మొదటి నుంచి ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలో అంత జాగ్రత్తగా ఉన్నామని ఆయన తెలిపారు.
 

మరిన్ని వార్తలు