సీఎస్‌కు సమీక్షించే అధికారం లేదా ?

25 Apr, 2019 20:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్షలు నిర్వహిస్తే టీడీపీకి ఉలికిపాటు ఎందుకని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్‌సీపీ నాయకుడు డేరంగుల ఉదయ్‌ కిరణ్‌ సూటిగా ప్రశ్నించారు. నాంపల్లిలోని హోటల్‌రాజ్‌ ఇంటర్నేషనల్‌లో ఆయన గురువారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై సమీక్ష చేసే అధికారం సీఎస్‌కు ఉందన్నారు. ఎన్నికల కౌంటింగ్‌పై సీఎస్‌ మాట్లాడితే తప్పేమిటని అన్నారు. ఎన్నికల గురించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే మాట్లాడాలా.? సీఎస్‌కు మాట్లాడే అధికారం లేదా అని ప్రశ్నించారు. 

చట్టాన్ని ఉల్లంఘించే టీడీపీ నాయకులు మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న సమయంలో కూడా టీడీపీ నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడుతు‍న్నారని ఆరోపించారు. అధికారులపై ఒత్తిడి చేసి అక్రమ మార్గంలో పనులను చక్కబెట్టుకుంటున్నట్లు విమర్శించారు. మాజీలయిప్పటికీ అధికారం చలాయించాలనే భ్రమలో టీడీపీ నాయకులు ఉండటం సిగ్గుచేటన్నారు. సీఎస్‌ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన టీడీపీ నాయకులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


 

మరిన్ని వార్తలు