‘దేవినేని ఉమ చేతకాని దద్దమ్మ’

6 Jul, 2018 17:10 IST|Sakshi
వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి కొలుసు పార్థసారధి

విజయవాడ : ఏపీ భారీ నీటిపారుదల శాఖా మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు చేతకాని దద్దమ్మ అని, కృష్ణా జిల్లాకు పట్టిన దరిద్రమని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిథి పార్థసారథి తీవ్రంగా ధ్వజమెత్తారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యాలయంలో పార్థసారధి శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. ముడుపుల కోసమే పట్టిసీమ ప్రాజెక్టు కట్టినట్లు ఉందని విమర్శించారు. నీటిపారుదల శాఖా మంత్రిగా ఉంటూ ఇసుక దోపిడీకి సహకరిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఇద్దరు మంత్రులు నాలుగేళ్లలో తామేదో సాధించినట్లు మంత్రిలా కాకుండా ఓ మంత్రసానిలా మాట్లాడారని మండిపడ్డారు. బీజేపీ అఫిడవిట్‌ చూసి ఏపీ ప్రజలు రగిలిపోతున్నారని తెలిపారు.

బీజేపీకి ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేదని, అఫిడవిట్‌లో చెప్పిన అంశాలు అనేకసార్లు గొప్పగా చెప్పారని తీవ్రంగా విమర్శించారు. టీడీపీ నేతలు ఏ ప్రాతిపదికన బీజేపీతో జతకట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముంపు మండలాల సమస్య స్థాయలో ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు ఎందుకు పోరాడలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా కోసం తాము పోరాడితే ఎగతాళి చేసింది వాస్తవం కాదా అని సూటిగా అడిగారు. బీజేపీ రాష్ట్రానికి చేసిన అన్యాయానికి టీడీపీ వంతపాడిందని ఆరోపించారు. బీజేపీని ప్రశ్నించడానికి టీడీపీకి ఎందుకు భయమన్నారు. ప్రత్యేక హోదా పక్కన పెట్టి ప్యాకేజీ కోసం ఎందుకు సిద్ధపడ్డారని,  నాలుగేళ్లు అన్యాయం జరుగుతుంటే ఎందుకు మౌనంగా చూశారని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా