కాంగ్రెస్‌లో అంతర్గత మార్పులు

23 Jun, 2018 03:15 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ పలు రాష్ట్రాల్లో పార్టీలో సంస్థాగత పలు మార్పులు చేశారు. మహారాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, లోక్‌సభాపక్షనేత మల్లికార్జునఖర్గేను నియమించారు. ముగ్గురు ఏఐసీసీ కార్యదర్శులకు కూడా మహా రాష్ట్ర బాధ్యతలు అప్పగించారు. వీరిలో తెలం గాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌ ఉన్నా రు.

ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌ చార్జి అశోక్‌ గెహ్లాట్‌కు అనుబంధంగా ఏఐసీసీ కార్యదర్శి హోదాలో జేడీ శీలం, మహేంద్ర జోషీలను, సంయుక్త కార్యదర్శి హోదాలో శశికాంత్‌ శర్మను నియమించారు. పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జిగా ఉమెన్‌ చాందీకి అనుబంధంగా తమిళనాడుకు చెందిన ఏఐసీసీ కార్యదర్శులు క్రిస్టోఫర్‌ తిలక్, సి.డి.మెయ్యప్పన్‌ను నియమించారు.  

ఏబీసీడీ వర్గీకరణనుస్వాగతిస్తున్నాం: దాసోజు
సాక్షి, హైదరాబాద్‌: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్‌ స్వాగతిస్తోందని టీపీసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ ఒత్తిడి మేరకే ప్రభుత్వం వర్గీకరణ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. శుక్రవారం ఫ్యాప్సీ బిల్డింగ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుల గణనను ప్రభుత్వం శాస్త్రీయ పద్ధతిలో చేపట్టాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వార్తలు