ఉత్తమ్, రేవంత్‌ తోడు దొంగలు

20 Oct, 2019 09:52 IST|Sakshi
మాట్లాడుతున్న మంత్రి జగదీశ్‌రెడ్డి

ఓటుకు నోటు కేసులో ఒకరు, రూ.3 కోట్లు కారులో కాలబెట్టుకుంది మరొకరు

కుటుంబపాలన అని విమర్శించిన వ్యక్తితో ఉత్తమ్‌ ప్రచారం

సాక్షి, హుజూర్‌నగర్‌ రూరల్‌ : ఉత్తమ్, రేవంత్‌రెడ్డి ఇద్దరు తోడుదొంగలని, వారు ప్రజలకు చేసిందేమీ లేదని  రాష్ట్ర విద్యుత్‌ శాఖ గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి విమర్శించారు. శనివారం హుజూర్‌నగర్‌లోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఏర్పాటు చే సిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. ఓటుకు నోటు కేసులో రూ.50లక్షలతో రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికింది ఒకరని, గత ఎన్నికల్లో రూ.3 కోట్లు కారులో కాలబెట్టుకున్న దొంగ మ రొకరని రేవంత్, ఉత్తమ్‌నుద్దేశించి ఆరోపించారు. ఇద్దరూ తోడు దొంగలని.. వారిద్దరూ కలిసి హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో ప్రచారం చేస్తుంటే ప్రజలు చర్చించుకుంటున్నారని పేర్కొన్నారు.  

కాంగ్రెస్‌ పార్టీ నాయకులు అబద్దాలు చెప్పడం, విమర్శలు చేయడమే తప్ప ని యోజకవర్గ అభివృద్ధికి ఎలాంటి హామీలూ ఇ వ్వలేదన్నారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గతంలో మా యమాటలు చెప్పి ప్రజలను తనవైపు తిప్పుకున్నారని, ఇప్పుడే జరిగే ఉపఎన్నికల్లో  చెప్పడానికి ఏమీ లేక  ఆధికారులు, ప్రభుత్వం, ఆభ్యర్థిపై విమర్శలకు దిగాడని విమర్శించారు. ఐదు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉండి ఈ ప్రాంతానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. మా పార్టీ అభ్యర్థి ఇక్కడ లేడంటూ,  భూకజ్జాలు చేశాడం టూ ఉత్తమ్‌ ఆరోపణలు చేయడం హాస్యాస్పదమన్నారు. సైదిరెడ్డి ఓడిపోయినప్పటికీ ప్రజల మధ్యనే ఉండి వారి సమస్యలను మంత్రుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నాడని పేర్కొన్నారు.

అలాంటి వ్యక్తిపై ఉత్తమ్‌ విమర్శలు, ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. మఠంపల్లి, మేళ్లచెర్వు, చింతలపాలెం మండలాల్లో ఎవరి వెంట రౌడీలు ఉన్నారో ప్రజలుకు తెలుసన్నారు. 20 ఏళ్లుగా  పెంచి పోషించిన ఆ రౌడీలే ప్రజల అస్తులను దోచుకొని, భూములను ఆక్రమించి శాంతిభద్రతలను నాశనం చేశారని ఆరోపించారు. వారి ఆగడాలను భరించలేక కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లోకి వస్తున్నారని పేర్కొన్నారు. పులిచింతల ప్రాజెక్టులో నిజంగా ముం పునకు గురయ్యే వ్యవసాయ భూములను వది లిపెట్టి ముంపునకు గురికాని, 20 ఫీట్లలోతు నీ రు వచ్చిన మునిగిపోని పీక్లానాయక్‌తండాను తన అనుచరుల కట్టబెట్టేందుకు కోట్లాది రూపాయలను దోచిపెట్టారని విమర్శించారు.

డబ్బు, భూ మాఫియాకు పాల్పడేది నువ్వేనని ఉత్తమ్‌ నుద్దేశించి అన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉండగా ఆ పార్టీ నాయకులు ఎంతో మంది కుంభకోణాలకు పాల్పడిన విషయాన్ని ప్రజలు మరిచిపోలేదని ఆరోపించారు.  ఉత్తమ్‌ బీజేపీతో మిలాఖత్‌ అయ్యాడని విమర్శించారు. పద్మావతికి టికెట్‌ వద్దని, కుటుంబపాలన చేస్తున్నావని విమర్శించిన వ్యక్తితో నేడు ఇక్కడ ప్రచారం చేయిస్తుంటే ప్రజలు నవ్వుకుంటున్నారని,  మీ దివాళా కోరుతనమే మీ ఓటమి కారణం కాబోతుందని ఎద్దేవా చేశారు. ఈసారి మోసపోవడానికి నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా లేరని, సీఎం కేసీఆర్‌ పార్టీలకు అతీతంగా అభివృద్ధి చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడని పే ర్కొన్నారు.  

ఎన్నికల కమిషన్‌ నిబంధనల ప్రకా రం ప్రచారం పూర్తి చేశామన్నారు. ఎన్నికల కమిషన్‌పై ఒత్తిడి తీసుకువచ్చి మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేయడమే కాకుండా తమ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను ఆపి తనిఖీ చేయించినా బాధ్యత గల పౌరులుగా తాము అధికారులకు సహకరించామని పేర్కొన్నారు. తాము చేసిన ఫిర్యాదులను తీసుకోకపోయినా చాలా ఓపికగా ఉన్నామని, ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలందరూ తమ వైపే ఉన్నారని అన్నారు.

20 రోజులుగా చేసిన ప్రచారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రజలకు వివరించిన సమస్యలపై ఆలోచించి టీఅర్‌ఎస్‌ ఆభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి ఓటేసి గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీ బడుగు లింగయ్య యాద వ్, ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, బాజిరెడ్డి గోవర్ధన్, ఆ పార్టీ ఎమ్మెల్యే ఆభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.   

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు