ఆరు నెలల్లో అంతా తేలిపోతుంది 

15 Feb, 2019 09:13 IST|Sakshi

ప్రభుత్వ డొల్లతనం  బయటపడుతోంది 

ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేని స్థితిలో ప్రభుత్వం 

డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం  

కరీంనగర్‌ : ఆరు నెలల్లో ప్రభుత్వ డొల్లతనం బయటపడుతుందని  డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం అన్నారు. గురువారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల స మావేశంలో మాట్లాడుతూ ఆచరణకు సా«ధ్యం కాని హమీలతో మభ్యపెట్టి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ప్రభుత్వ ఉద్యోగులకు  10వ తేదీ వరకు జీతాలు చెల్లించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు. ప్ర భుత్వ ఆదాయం మద్యం, ఇసుక ద్వారానే స మకూరుతుందని, ప్రజలకు మద్యం తాగించేందుకు ప్రోత్సహిస్తోందని విమర్శించారు.  గ్రామానికి ఒకటి, రెండు బెల్ట్‌షాప్‌లతో తాగుబోతులను తయారు చేస్తున్నారని అన్నారు.

పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ పోటీ చేస్తుందని వెల్లడించారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కేసీఆర్‌కు సంబంధం ఉండ దని, రాహుల్,మోదీ మధ్యనే పోటీ ఉంటుం దన్నారు.  పెద్దనోట్ల రద్దు, జీఎస్టీతో ప్రజలపై బీజేపీ ప్రభుత్వం పెనుభారం మోపిందని మండిపడ్డారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు.  కేసీఆర్‌ ఇటు ఎంఐఎం, అటు బీజేపీకి దగ్గరగా ఉంటూ రెండు పడవలపై ప్రయా ణిస్తున్నారన్నారు. శుక్రవారం కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంట్‌ లోక్‌సభ సమీక్షలకు పార్లమెంట్‌ సెగ్మెంట్‌ నాయకులు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ నాయకులు చాడగోండ బుచ్చిరెడ్డి, చింతల కిషన్, జొన్నల రమేశ్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు