‘ఢిల్లీ ఏమైనా మధ్యలో ఉందా’

20 Jan, 2020 16:51 IST|Sakshi

చంద్రబాబుపై కొడాలి నాని విమర్శలు

సాక్షి, అమరావతి : తమిళనాడులో ఉన్నప్పటి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలు అభివృద్ది చెందే ఉన్నాయని మంత్రి కొడాలి నాని అన్నారు. అమరావతి వల్ల ఈ రెండు జిల్లాలకు వచ్చేదేమీ లేదని పేర్కొన్నారు. మూడు రాజధానుల బిల్లుపై చర్చ సందర్భంగా కొడాలి నాని అసెంబ్లీలో మాట్లాడారు. ఈ బిల్లును ప్రవేశ పెట్టినందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతఙ్ఞతలు తెలిపారు.  సామాజిక అంశాన్ని చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాజధాని తరలిపోతే కమ్మ కులస్తులకు అన్యాయం జరుగుతుందని.. రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్‌ నాయుడు అసత్య ప్రచారం చేస్తున్నారని నాని మండిపడ్డారు. కేవలం కమ్మవారి కోసమే ఇక్కడ రాజధాని పెట్టారా..? అని ప్రశ్నించారు.
(చదవండి : రాజధానులు ఎంతెంత దూరం)

మధ్యలో ఉంటేనా అభివృద్ధి చెందుతుందా..?
‘డబ్బా మీడియా, చెత్త పేపర్లతో చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఏపీకి మధ్యలో ఉంటేనే అమరావతి అభివృద్ధి చెందుతుందని చంద్రబాబు చెప్తున్నారు. భారత దేశానికి ఢిల్లీ మధ్యలో ఉందా..?  రాష్ట్ర ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆలోచించడం లేదు. వ్యక్తిగత ప్రయోజనాలే కోసమే పరితపిస్తున్నారు. చంద్రబాబుకు స్పష్టత కరువైంది. ఇది అసలు అమరావతి కాదు. ఇది చంద్రబాబు అమరావతి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వ భూములను తీసుకోవాలని వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టంగానే చెప్పారు’ అని మంత్రి కొడాలి నాని పేర్కొన్నారు.
(చదవండి : 72 ఏళ్లు గడిచినా రాజధాని కూడా లేదు...)

మరిన్ని వార్తలు