ప్రజలు కేసీఆర్‌కు దిమ్మదిరిగే షాక్‌ ఇచ్చారు 

25 May, 2019 02:22 IST|Sakshi
నల్లగొండలో ఆనందంతో నృత్యం చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 

నల్లగొండ: రాష్ట్ర ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌కు దిమ్మదిరిగే విధంగా షాక్‌ ఇచ్చారని మాజీ మంత్రి, భువనగిరి ఎంపీగా విజయం సాధించిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండలో భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా గడియారం సెంటర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్‌లో నియంతృత్వ ధోరణి పెరిగిందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన తనపైనే అసెంబ్లీ ఎన్నికల్లో కోట్లు ఖర్చుపెట్టి ఓడించారని ఆరోపించారు.

అలాంటి కేసీఆర్‌కు తెలంగాణ ప్రజలు 5 మాసాల్లోనే దిమ్మతిరిగేలా షాక్‌ ఇచ్చారన్నారు. సంతలో పశువుల మాదిరిగా ఎమ్మెల్యేలను కొన్న కేసీఆర్‌కు తగిన గుణపాఠమే చెప్పారన్నారు. తాను ఆరోజే దేవుడు చూస్తాడని అన్నానని, అదే ఈ ఎన్నికల్లో జరిగిందన్నారు. తాను తెలంగాణ కోసం త్యాగం చేస్తే కేసీఆర్‌ కుటుంబం మాత్రమే బాగుపడ్డదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు