ప్రెస్‌మీట్‌కు ముందు బుద్ధా వెంకన్నతో లగడపాటి భేటీ

18 May, 2019 18:46 IST|Sakshi

సాక్షి, అమరావతి : రేపు చంద్రగిరిలో రీపోలింగ్‌ జరుగనున్న నేపథ్యంలో మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్‌ మరో సరికొత్త నాటకానికి తెరలేపారు. తెలుగుదేశం పార్టీకి లబ్ది చేకూర్చేందుకు నిబంధనలు సైతం తుంగలో తొక్కారు. ఎన్నికల్లో ఫలితాలు టీడీపీకే అనుకూలం అంటూ నిబంధనలకు విరుద్ధంగా సర్వే వివరాలు బయటపెట్టారు. కాగా సర్వే వివరాలు వెల్లడించడానికి ముందు రాజగోపాల్‌ టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్నతో భేటీ అయ్యారు. మీడియా సమావేశం కంటే ముందే బుద్ధా వెంకన్నతో అరగంట పాటు ఆయన భేటీ కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో లగడపాటి రాజగోపాల్‌ మీడియా సమావేశంలో ఏం మాట్లాడుతారనే విషయంపై విశ్లేషకులు ముందే ఒక అభిప్రాయానికి వచ్చారు. ఊహించినట్టుగానే పచ్చ పార్టీ భజన చేయడానికి మాత్రమే ఆయన విలేకరుల ముందుకు వచ్చినట్టు ఉందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి :
టీడీపీ ఎమ్మెల్సీతో లగడపాటి భేటీ 

ఇక అమెరికా నుంచి హుటాహుటిన వచ్చి లగడపాటి ఈ విధంగా మీడియా సమావేశం ఏర్పాటు చేయడం వెనుక దురుద్దేశం ఉందన్న విషయం స్పష్టమవుతోందని పలువురు విమర్శిస్తున్నారు. రీపోలింగ్‌లో టీడీపీకి లబ్ది చేకూర్చేలా వ్యవహరించడం వెనుక ఆ పార్టీ నేతల హస్తం ఉందని ఆరోపిస్తున్నారు. కాగా గతేడాది చివరిలో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో తన సర్వే అంచనాలు తప్పడంతో లగడపాటి రాజగోపాల్‌ తీవ్ర విమర్శలపాలైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం అధికారం చేపట్టిన టీఆర్‌ఎస్‌ దారుణంగా ఓడిపోతుందని, టీడీపీతో పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తుందని వెల్లడించిన ఆయన సర్వే పూర్తి వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చింది. దీంతో రాజగోపాల్‌ సర్వే విశ్వసనీయతపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి.

మరిన్ని వార్తలు