నీ అవినీతి చిట్టా బయటపెడతా

27 Mar, 2019 13:17 IST|Sakshi
మాట్లాడుతున్న విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ల విజయప్రసాద్‌

గణబాబుకు వైఎస్సార్‌సీపీ పశ్చిమ అభ్యర్థి మళ్ల హెచ్చరిక

సాక్షి, విశాఖపట్నం: ‘నా జోలికి వస్తే..నీ అవినీతి చిట్టా బయటపెడతా ఖబడ్డార్‌ ..’ అని  టీడీపీ అభ్యర్థి గణబాబునుద్దేశించి వైఎస్సార్‌సీపీ విశాఖ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ల విజ యప్రసాద్‌ సవాల్‌ విసిరారు. మద్దిలపాలెంలోని నగర పార్టీ కార్యాలయంలో మంగళవారం మళ్ల మీడియా సమావేశంలో మాట్లాడారు. నా అఫిడవిట్‌ సరిగ్గా లేదని రిటర్నింగ్‌ అధికారి దగ్గర టీడీపీ అభ్యర్థి గణబాబు అభ్యంతరం తెలిపారని, ఎన్ని కల నియమావళి ప్రకారం తాము నడుచుకుంటా మని..  ఇది మా పరిధిలోని అంశం కాదని  రిటర్నింగ్‌ అధికారి చెప్పే సరికి తోకలు ముడిచారన్నారు. అనంతరం దిక్కుతోచనిస్థితిలో ఏదో విధం గా నాపై బురద జల్లాలని మీడియా ముందుకు వచ్చి  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు న్యాయబద్ధంగా పన్ను చెల్లిస్తున్న వెల్ఫేర్‌ బిల్డింగ్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

గణబాబు ఓటమి భయంతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. నీతి నిజాయితీలతో చట్ట బద్ధంగా వ్యాపా రం చేస్తున్న నాజోలికి వస్తే నీ అవినీతి చిట్టా బయటపెట్టాల్సివస్తోందని మళ్ల హెచ్చరించారు.  20 ఏళ్లుగా పన్నులు కట్టి వ్యాపారం చేస్తున్నాని, మీలా ఇక్కడ దోచుకుని విదేశాల్లో దాచుకోలేదని విమర్శించారు. వందలమందికి ఉద్యోగాలు కల్పిస్తుస్తున్నానన్నారు. ఎప్పటికీ తాను అవినీతి చేయనని, ఐదేళ్లపాటు అవినీతి ఆరోపణలు లేకుండా పాలన చేశానన్నారు.హెచ్‌పీసీఎల్‌ సీఎస్‌ఆర్‌ ఫండ్‌తో మల్కాపురంలో కోట్ల రూపాయులతో టెండర్‌ వస్తే అతితక్కువగా నీ బినామీ వ్యక్తులకు ఇప్పిం చుకుంది వాస్తవం కాదా అని మళ్ల ప్రశ్నించారు.

నీ ఆక్రమణల చిట్టా ఆధారాలతో ఉంది
ప్రభుత్వ స్థలాలను, చెరువుల భూములను కబ్జా చేసి  నిర్మాణం చేయిస్తున్నట్టు నా దగ్గర రికార్డులతో సహా ఆధారాలున్నాయని చెప్పారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గంలో ఎవరు నిర్మాణం చేసి న వారి దగ్గరనుంచి లక్షనుంచి రూ.5లక్షలు వసూలు చేసిన మాట వాస్తవం కాదా అని గణబాబును ప్రశ్నించారు. జిల్లా పరిషత్‌ స్థలాన్ని కబ్జా చేసి గోపాలపట్నంలో థియేటర్‌కట్టలేదా..నీకు దమ్ము ధైర్యంఉంటే రెవెన్యూ అధికారులతో బహిరంగ సర్వే చేయించి  ఆక్రమణకు పాల్పడలేదని నిరూపించుకుంటావాఅనిగణబాబుకుసవాల్‌ విసిరారు.

నీవు నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా
నియోజకవర్గంలో ఐదేళ్ల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన నేను అవినీతికి పాల్పడ్డానని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని...లేదంటే నీవు తప్పుకుంటావా టీడీపీ ఎమ్మెల్యే గణబాబునుద్దేశించి సవాల్‌విసిరారు. నా మీద కావాలనే బురదజల్లుతున్నారని, దొడ్డిదారుల్లో అక్రమంగా సేకరించిన డిపాజిట్లు, సొమ్మును ఎన్నికల్లో ఖర్చుపెట్టడానికి సిద్ధమవుతున్న వైనాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. నీలా ప్రజల ధనాన్ని దోచుకోన ని అవినీతి రాజకీయాలు చేయబోనని స్పష్టం చేశారు. పశ్చిమ బెంగాళ్‌లో ఉన్న శారదా కంపెనీ మూతపడిన తర్వాత చిట్‌ఫండ్‌ కంపెనీ అనుకుని వెల్ఫేర్‌ కంపెనీకూడా చిట్‌ఫండ్‌ కంపెనీ అనుకుని సీబీఐ వాళ్లు సుమోటాగా కేసు తీసుకొని సీబీఐ వాళ్లు మూడేళ్ల కింద వచ్చారని, అప్పుడు మీడియాలో కూడా వెల్ఫేరు కంపెనీపై ఎలాంటి ఆరో పణలు లేవని వెల్లడించిన విషయం గుర్తు లేదా అని నిలదీశారు. మీరు ఎమ్మెల్యేగా ఉన్న ఐదేళ్లలో చేసిన భూకభ్జాలకు అడ్డుపడుతున్నాడని వీఆర్‌ఓని రావద్దని భయపెట్టినట్టు స్వయాన ఆ వీఆర్‌ఓనే  కలెక్టర్‌కి లేఖ రాశాడాన్న సంగతి మర్చిపోయావా ప్రశ్నించారు.సమావేశంలో ఆ పార్టీరాష్ట్ర అదనపు కార్యదర్శి దివాకర్‌ పక్కి పాల్గొ్గన్నారు.

మరిన్ని వార్తలు