ఏపీ శాసన మండలిలో ఆందోళన

6 Feb, 2019 10:55 IST|Sakshi

సాక్షి, అమరావతి : కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీం (సీపీఎస్‌) రద్దు చేయాలంటూ ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలిలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు ఇంచార్జి చైర్మన్‌ రెడ్డి సుబ్రమణ్యంకు వాయిదా తీర్మానం ఇచ్చారు. సీపీఎస్‌పైన చర్చించాలంటూ వెల్‌లోకి వచ్చి నినాదాలు చేశారు. సమస్యలపై చర్చించకపోతే సభకెందుకు రావాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. టీ బ్రేక్‌ సమయంలో ఈ విషయంపై చర్చిద్దామని, తన చాంబర్‌కు రావాల్సిందిగా ఇంచార్జి చైర్మన్‌ చెప్పగా.. మండలిలో చర్చ జరగాల్సిందేనని పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. సీపీఎస్‌ను రద్దుపై ప్రభుత్వం ఉదాసీనంగా ఉంటే ఉద్యోగులంతా కలిసి సార్వత్రిక సమ్మెలకు వెళ్తారని హెచ్చరించారు. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న టీచర్లపై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.   (సీపీఎస్‌ రద్దు కోరుతూ... కదం తొక్కిన ఉద్యోగులు)

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు