ఏపీ ఓటర్లు చంద్రబాబును నమ్మొద్దు

8 Apr, 2019 01:18 IST|Sakshi
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమైన మోత్కుపల్లి నర్సింహులు

జగన్‌తో మాజీ మంత్రిమోత్కుపల్లి నర్సింహులు  భేటీ

వైఎస్సార్‌ సీపీకి ప్రైవేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ సంపూర్ణ మద్దతు

పార్టీలో చేరిన ఏపీ కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శి వెంకటనారాయణ

సంపూర్ణ మద్దతు తెలిపిన ఎన్‌ఆర్‌ఐలు

సాక్షి, హైదరాబాద్‌ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ తేదీ సమీపిస్తుండటంతో.. సీఎం చంద్రబాబునాయుడు చేసే మోసపు వాగ్దానాలు, గిమ్మిక్కులు, ప్రలోభాలకు లొంగిపోకుండా ఏపీ ప్రజలు అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సిం హులు చెప్పారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌ లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌ సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మోత్కుపల్లి నర్సిం హులు మాట్లాడుతూ.. ఏపీలో చంద్రబాబును ఓటర్లు నమ్మే పరిస్థితి లేదన్నారు. అధికారం కోసం చివరి నిమిషంలో బాబు ఎన్ని అరాచకాలకయినా పాల్పడతాడని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల ద్రోహి చంద్రబాబు అన్నారు. వర్గీకరణ పేరుతో మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టిన దళిత వ్యతిరేకి చంద్రబాబుని ఏకిపారేశారు. పోలింగ్‌ సమయం నాటికి ఏపీ ప్రజలు, ఓటర్లు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించి, మాట తప్పని, మడమ తిప్పని నేతను ఎన్నుకోవాలని సూచించారు. జగన్‌ మేనిఫెస్టో జనరంజకంగా ఉందని మోత్కుపల్లి చెప్పారు.

రాష్ట్ర ప్రైవేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ మద్దతు..
భారతదేశంలోనే తొలిసారి ప్రైవేట్‌ టీచర్స్‌ అవస రాలు, సమస్యలను మేనిఫెస్టోలో పొందు పరిచి, పరిష్కరించడానికి ముందుకొచ్చిన ఏకైక పార్టీ  వైఎస్సార్‌ సీపీ మాత్రమేనని  రాష్ట్ర ప్రైవేట్‌ టీచర్స్‌ అండ్‌ లెక్చరర్స్‌ యూనియన్‌ (పీటీఎల్‌యూ) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి. అంబేడ్కర్,  పి. జయభారత రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం అన్ని జిల్లాల నుంచి వచ్చిన ప్రతినిధులతో కలిసి వారు హైదరాబాద్‌లోని వైఎస్‌ జగన్‌ నివాసంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిని కలిసి మద్దతు తెలిపారు. కచ్చితంగా రాబోయే ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రావడానికి  5 లక్షల మంది సభ్యులున్న తమ సంఘం తరఫున కృషి చేస్తామని చెప్పారు. నేతలు ఎం.రియాజ్‌ ఖాన్, ఎస్‌ చాంద్‌ భాషా, ఎం. మద్దిలేటి, క్రిష్ణమూర్తి, బి.శివశంకర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

చంద్రబాబును ప్రజలు ఛీ కొడుతున్నారు
ఏపీ కాంగ్రెస్‌  కమిటీ  కార్యదర్శి పి.వెంకటనారా యణ ఆ పార్టీని వీడి  వైఎస్‌ జగన్‌ సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. జగన్‌ ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయన మాట్లాడుతూ.. జగన్‌ సీఎం కావాలనే ధ్యేయంగా పనిచేస్తామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమ ర్శించారు. ఎక్కడ చూసినా ప్రజలు చంద్రబాబును ఛీ కొడుతున్నారని వెంకటనారాయణ చెప్పారు.

జగన్‌ను కలిసిన ఎన్‌ఆర్‌ఐలు
వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎన్‌ఆర్‌ఐ విభాగం నాయకులు వెంకట్‌ ఆధ్వర్యంలో ఎన్‌ఆర్‌ఐలు హరిప్రసాద్, హెచ్‌పీ రెడ్డి, నిరంజన్‌ రెడ్డి  వైఎస్‌ జగన్‌ను కలిశారు. వారు మాట్లాడుతూ.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ విజయం కోసం చాలా రోజుగా జిల్లాల్లో పని చేస్తున్నామన్నారు. ప్రజల సంపూర్ణ మద్దతు ఉన్న జగన్‌ తప్పక సీఎం అవుతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు