సీఎం జగన్‌ పాలనలో వారికి పెద్దపీఠ

29 Feb, 2020 20:26 IST|Sakshi
ఎంపీ బాలశౌరి

సాక్షి, కృష్ణా : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మహిళలకు పెద్ద పీఠ వేసిన నాయకుడని ఎంపీ బాలశౌరి అన్నారు. 50 శాతం మహిళలకు పదవులు దక్కుతున్నాయంటే సీఎం వైఎస్‌ జగన్‌ తీసుకువచ్చిన చట్టం ద్వారానేనని పేర్కొన్నారు. గతంలో ఎక్కడైనా మార్కెట్ యార్డు చైర్మన్లుగా 12 మంది మహిళలు ఉన్న దాఖలాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాద యాత్రలో ఇచ్చిన హామీలను  ఒక్కొక్కటిగా అన్నీ నెరవేరుస్తున్నారని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి కట్టిన పులిచింతల ప్రాజెక్టుకు వైఎస్‌ జగన్‌ సీఎం అయ్యాక 45 టీఎంసీల నీరు వచ్చాయని తెలిపారు.

గత ప్రభుత్వం ఏడు సంవత్సరాలు రబీకి నీరు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. రెండో పంటకు నీరు ఇచ్చిన ప్రభుత్వం వైఎస్‌ జగన్‌దేనన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మచిలీపట్నం పోర్టుకు త్వరలో శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. మచిలీపట్నంలో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నామని అన్నారు.

సీఎం జగన్‌ పాలనలో వారికి పెద్దపీఠ
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు పెద్ద పీఠ వేశారని పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జిల్లాలో గతంలో 19 మార్కెట్ యార్డులు ఉంటే ఈ రోజు 22 ఉన్నాయన్నారు. 11 మార్కెట్ యార్డుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు  చైర్మన్లుగా పదవులు దక్కాయన్నారు. అక్కా చెల్లెళ్ల కోసం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 50శాతం రిజర్వేషన్లు చట్టం చేశారని తెలిపారు.

మరిన్ని వార్తలు