ఓవర్‌నైట్‌లో డెలివరీ బాయ్‌ కాస్త సెలబ్రిటీ

29 Feb, 2020 20:34 IST|Sakshi

న్యూఢిల్లీ: జొమాటోకు చెందిన ఓ ఫుడ్‌ డెలివరీ బాయ్‌ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు. ఓవర్ నైట్‌లో అతడు పాపులర్ అయ్యాడు. మొహం మీద చెరగని చిరునవ్వుతో ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నాడు. ఒక చిరునవ్వు అతడి జీవితాన్ని మలుపుతిప్పింది. ప్రముఖ ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో ఇండియా డెలివరీ బాయ్ పిక్‌ని తమ సోషల్ మీడియా అకౌంట్స్‌లో ప్రొఫైల్ పిక్‌గా పెట్టింది. అతడి పేరు సోను అని ఈ వీడియోలో తెలిపాడు. ఓ వ్యక్తి అతడితో మాట్లాడుతూ జొమాటోలో రోజుకు ఎంత సంపాదన ఎంత వస్తుంది? ఎన్ని గంటలు పనిచేస్తావ్? ఏమి తింటావ్ అనే ప్రశ్నలు అడిగాడు.

వీటికి సోను సమాధానంగా.. నేను రోజూ 12 గంటలు పనిచేస్తాను. ఇన్సెంటివ్స్‌తో కలిపి రోజుకు రూ.350 వస్తుంది అని తెలిపాడు. మీరు తినేందుకు కంపెనీ ఏమైనా ఇస్తుందా అనే ప్రశ్నకు బదులిస్తూ.. లేదు కానీ, ఏదైనా ఆర్డర్ క్యాన్సిల్‌ అయితే అది మేం తీసుకోవచ్చు అని తెలిపాడు. మరి, కస్టమర్లకు ఇవ్వాల్సిన డెలివరీ ఫుడ్ కూడా తినేస్తావా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అలాంటి పనులు ఎప్పుడూ చేయను. కంపెనీ నాకు సమయానికి జీతం ఇస్తుంది. నాకు వారితో ఎలాంటి ఇబ్బంది లేదు అని తెలిపాడు. చదవండి: విమానంలోకి పావురం ఎలా వచ్చిందో!

ఈ వీడియో ఆద్యంతం అతను చిరునవ్వు చిందిస్తూనే ఉంటాడు. దీంతో నెటిజన్స్ అతడికి జొమాటో రైడర్.. హ్యాపీ రైడర్ అని పేరు పెట్టారు. ఈ వీడియోని ఢిల్లీ డీసీ రైడర్‌ విలాగర్‌ టిక్ టాక్‌లో పెట్టింది. ఇక అంతే ఆ వీడియో ఒక్కసారిగా వైరల్ అయ్యింది. వీడియోలో సోను ఇచ్చిన స్మైల్ నెటిజన్లను ఫిదా చేసింది. టిక్ టాక్‌లో ఆ వీడియోని 47లక్షల మంది చూశారు. అలా అలా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఇది గమనించిన జొమాటో ఇండియా వెంటనే తమ ఇన్ స్టాగ్రామ్, ట్విటర్ అకౌంట్లకు డెలివరీ బాయ్ సోను పిక్‌ని ప్రొఫైల్ పిక్‌గా పెట్టింది. నౌ ఏ హ్యాపీ రైడర్ ఫ్యాన్ అకౌంట్ అంటూ ట్యాగ్ చేసింది. క్షణాల్లో ఆ వీడియోలోని సోను ఫేస్‌ మీమ్స్‌కు వేదికైంది. పాపులర్‌ వ్యక్తుల ముఖాలను మార్చేసి సోను పిక్‌ని ఉంచారు. ఇలా ఓవర్‌నైట్‌లో డెలివరీ బాయ్‌ సోను కాస్త సెలబ్రిటీ అయ్యాడు.

Read latest Social-media News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా