'రాహుల్‌.. దమ్ముంటే సీఏఏపై 10 వాక్యాలు మాట్లాడు'

17 Jan, 2020 20:42 IST|Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా విమర్శలు గుప్పించారు. సీఏఏకి మద్దతుగా ఢిల్లీలో బౌద్ధ మత సంఘం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పౌరసత్వ సవరణ చట్టంపై దేశ ప్రజలను తప్పుదోవ పట్టించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

దేశంలో కొందరు ఎలాంటి అవగాహన లేకుండా వారి పరిజ్ఞానాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్నారని, తద్వారా ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారని మండిపడ్డారు. ఇది దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాహుల్‌కు దమ్ముంటే సీఏఏపై కనీసం 10 వాక్యాలు మాట్లాడాలని సవాల్ చేశారు. సీఏఏతో రాహుల్‌కు ఉన్న ఇబ్బందేంటో కనీసం రెండు వాక్యాలైయినా చెప్పాలన్నారు. ఓ పార్టీకి నాయకత్వం వహిస్తూ ఇలా దేశాన్ని పక్కదారి పట్టించడం సబబు కాదని హితవు పలికారు.

చదవండి: మోదీ-షా ఇద్దరిలో ఎవరు నిజం : బాఘేలా

చదవండి: పవన్‌ డాన్స్‌లు, డ్రామాలు వేస్తే పెట్టుబడులు రావు: కేఏ పాల్‌

మరిన్ని వార్తలు