రాజస్థాన్‌ ఎన్నికలు: నోరు జారిన ఖర్గే, క్షమాపణలు

21 Nov, 2023 15:09 IST|Sakshi

రాజస్థాన్‌ ఎన్నికల సభలో కాంగ్రెస్‌సీనియర్‌ నేత  నోరుజారి ఒకరి పేరుకు బదులుగా మరొకరి పేరును ప్రస్తావించడం వైరల్‌గా మారింది. 
సోమవారం ఒక బహిరంగ సభలో మాట్లాడిన పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే ఒక సందర్భంగా  దివంగత  ప్రధానమంత్రి రాజీవ్‌ గాంధీ పేరుకు బదులుగా  ఆయన కుమారుడు రాహుల్‌ గాంధీపేరును  పేర్కొనడం విమర్శలకు తావిచ్చింది.  దీన్ని అవకాశంగా తీసుకున్న బీజేపీ ‘యే కబ్ హువా?’ (ఇది ఎప్పుడు జరిగింది?)  ట్విటర్‌లో ఆక్షేపించింది.

అనూప్‌గఢ్‌ (Anupgarh)లో ఏర్పాటు చేసినబహిరంగసభలో ఖర్గేమాట్లాడుతూ ‘రాహుల్‌గాంధీ లాంటి నేతలు దేశ ఐక్యత కోసం ప్రాణాలర్పించారు’  అంటూ వ్యాఖ్యానించారు. అయితే, వెంటనే పొరపాటు గ్రహించిన ఆయన క్షమాపణలు చెప్పారు. పొరపాటున రాహుల్‌ గాంధీ పేరు ప్రస్తావించానంటూ వివరణ ఇచ్చారు. జాతి సమైక్యత  కోసం రాజీవ్‌ గాంధీ సహా పలువురు కాంగ్రెస్‌లో దేశం కోసం ప్రాణాలర్పించిన నాయకులున్నారు. కానీ బీజేపీలో మాత్రం ప్రాణాలు తీసే నేతలు ఉన్నారంటూ బీజేపీపై  విమర్శలు గుప్పించారు.

కాగా రాజస్థాన్‌లో నవంబర్ 25వ తేదీన అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను మంగళవారం విడుదల చేసింది.  ఖర్గే,  సీఎం  అశోక్ గహ్లోత్, సచిన్ పైలట్, గోవింద్ సింగ్, సీపీ జోషి  ఇతర పార్టీ సీనియర్ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మేనిఫెస్టోకు ‘జన ఘోషన పత్ర’గా పేరు పెట్టారు.  200 స్థానాలు కలిగిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ప్రతిష్టాత్మకం.ఫలితాలు డిసెంబరు 3న  వెల్లడికానున్నాయి.  

మరిన్ని వార్తలు